ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియచేస్తున్న రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య.. పోలీసు యాక్ట్ పేరు చెప్పి, జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు హుకుం జారీ చేయడం హక్కులను కాలరాయడమే అని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు.. అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలిపారు.
రైతులు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోతున్నారు. ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది అని దుయ్యబట్టారు.
ప్రభుత్వం రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా, పోలీసులను పురమాయించి గొంతెత్తిన వారిని బెదిరించడం, అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గం.. ఒకవైపు రైతుబంధు రాక, మరోవైపు రుణమాఫీ కాక అన్నదాత ఆవేదనలో ఉన్నడు. వ్యవసాయ పనులు చేసుకోవాలా లేక రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు అని హరీష్ రావు విమర్శించారు.
ఏకకాలంలో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం అట్టర్‌ఫ్లాప్ అయ్యారు. నమ్మి ఓటేసినందుకు రైతన్నను నట్టేట ముంచారు.. కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారింది. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మరిచిపోయినట్లున్నారు అని అన్నారు.
ఇప్పటికైనా కండ్లు తెరిచి రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం.. అదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే అరెస్టు చేసిన రైతన్నలకు అండగా బీఆర్ఎస్ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని తెలిపారు.
- Teachers’ transfers: No teachers in 17 Model Schools across Telangana
- Rs. 4,500 cr debt in September: Revanth pushing Telangana into debt trap
- Revanth’s plan to utilize ‘Pharma City’ lands for his ‘Future city’ foiled
- Inordinate delay: Congress struggling to expand Telangana cabinet
- All time record: Revanth govt. makes Rs. 10,392 cr debt in July
- రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టి రాజకీయాలు మాట్లాడే ఏకైక సీఎం రేవంత్: హరీష్ రావు
- పాలన పక్కన పెట్టి కేసీఆర్, బీఆర్ఎస్ని దూషించటమే రేవంత్ పని: కేటీఆర్
- బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలిస్తాం: కేటీఆర్
- రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పతనమవుతున్నది: రేవంత్‌కు హరీష్ రావు లేఖ
- రేపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు
- రేవంత్ చేసిన అబద్ధపు ప్రచారాలు vs అసలు నిజాలు
- అధిష్టానం వద్ద పరపతి కోల్పోయిన రేవంత్?
- నమ్మించి గొంతుకోసిన రేవంత్!
వలస ఎమ్మెల్యేల బతుకు ‘బస్‌స్టాండేనా’? - రేవంత్ సీఎం అయింది పేదవాళ్ల ఇళ్లు కూలగొట్టడానికా?: కేటీఆర్
- హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌లో భయం మొదలైంది: కేటీఆర్