కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫార్ములా-ఈ కేస్‌పైన స్పందిస్తూ.. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేము ఉద్యమకారులం.. ఉద్యమ నాయకుడి బిడ్డలం. ఇలాంటి అక్రమ కేసులకు, అణిచివేతలకు, కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి న్యాయంగా కొట్లాడుతాం. కేవలం ముఖ్యమంత్రి ఆయన కుటుంబం చేస్తున్న అవినీతిని స్కాంలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నందువల్లనే మాపై రాజకీయ వేధింపులకు దిగుతున్నది ఈ ప్రభుత్వం. చట్ట ప్రకారం ముందుకు వెళ్తాము. ఈ అంశంలో మా లీగల్ సెల్ చేపట్టాల్సిన కార్యాచరణ చేపడుతుంది అని తెలిపారు.
శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వం మాపైన, మా పార్టీపైన చేస్తున్న ఈ కుట్రలను ఎండగడతాం. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని రెచ్చగొట్టాలని చూసిన ప్రజాస్వామ్యయుతంగా, న్యాయపరమైన మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ముందు నిలబెడతాం. ముఖ్యమంత్రి ఎన్ని రకాల అటెన్షన్ డైవర్షన్ పనులు చేసిన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలు చేసేదాకా వదిలిపెట్టం. రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం అని అన్నారు.
ఈరోజు నేను చెప్పిన ప్రతి మాటకి చూపించిన ప్రతి డాక్యుమెంట్‌కి కట్టుబడి ఉన్నాను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మొత్తం వ్యవహారంలో భంగపాటు తప్పదు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా చేస్తున్న దుష్ప్రచారాన్ని గమనించాలని.. మమ్మల్ని ఎన్నుకొని ప్రధాన ప్రతిపక్షం పాత్ర ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియజేయాల్సి ఉన్న నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని కుట్రలను ప్రజల ముందు ఉంచాను. ప్రజలు నిజా నిజాలు గుర్తించి ప్రభుత్వ కుట్రలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.
ముఖ్యమంత్రి దివాలాకోరుతనం వల్లనే ఈ కేసు పెట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా-ఈ అంశంలో అవినీతి జరిగింది అని భావిస్తే అందుకు తగిన ఆధారాలు సాక్ష్యాలు ఉంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలోనే చర్చ పెట్టమని సవాలు విసురుతున్న. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు లేదు. కేవలం రాజకీయపరమైన దురుద్దేశంతోనే ఈ ఫార్ములా ఈ కేసు నమోదు చేయడం జరిగింది అని దుయ్యబట్టారు.
నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలివైన మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉంటే అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజల దృష్టికి ఇందులో జరిగిన అవినీతిని చెప్పాలి. కానీ అసెంబ్లీలో మాట్లాడలేని దద్దమ్మ మంత్రులు ముఖ్యమంత్రి కేవలం లీకులతో దుష్ప్రచారం చేస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో అనా పైసా కూడా వృధా కాలేదు. ఈ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే రేసులు రద్దు అయ్యాయి. దీంతో రాష్ట్రానికి రావలసిన ఈవీ రంగంలోని పెట్టుబడులతో పాటు పేరు కూడా పోయింది అని కేటీఆర్ విమర్శించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది. భవిష్యత్తులో ఫార్ములా-ఈ, ఫార్ములా రేసులు దేశానికి రాకుండా ప్రపంచ ఫార్ములా-ఈ వ్యవస్థలో తీవ్ర నష్టం జరిగింది హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రానిక్ వెహికల్స్ రంగంలో ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలిపేందుకు ఫార్ములా-ఈ రేస్‌ని నిర్వహించాలని ప్రయత్నం చేశాము. అందులో విజయవంతంగా మొదటి రేసును పూర్తి చేశాము. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున హెచ్ఎండీఏ సుమారు రూ. 30 కోట్లు, ప్రైవేటు స్పాన్సర్ ఏస్ అర్బన్ మరో రూ. 110 కోట్లు ఖర్చు చేశాయి అని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన కేవలం 30 కోట్ల రూపాయల ఖర్చుతో రేసు అనంతరం హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్ల రూపాయల ప్రయోజనం కలిగిందని నీల్సన్ సంస్థ తెలిపింది. అయితే తొలి దఫా జరిగిన రేస్ అనంతరం ప్రైవేట్ స్పాన్సర్‌కి ఆర్థికపరమైన నష్టం రావడంతో రెండవ రేస్‌లో తాను పాల్గొనలేనట్లు తెలియజేశారు. దీంతో ఫార్ములా-ఈ రేస్ నిర్వాహక సంస్థ తెలంగాణ ప్రభుత్వానన్ని కొనసాగించాలా లేదా ఆపివేయాలా అని అడిగింది అని తెలిపారు.
అయితే ప్రపంచ నగరాలతో పోటీపడి భారతదేశానికి రేస్ తీసుకువచ్చి హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించిన అనంతరం జరిగిన ఆర్థిక ప్రయోజనము, రేస్ సందర్భంగా నిర్వహించిన తెలంగాణ ఈ-మొబిలిటీ వీక్‌లో సాధించిన వందల కోట్ల రూపాయల ఎలక్ట్రిక్ వాహన రంగ పెట్టుబడుల నేపథ్యంలో.. రానున్న మూడు సంవత్సరాల పాటు ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు రేసులను నిర్వహించాలని ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నాము అని కేటీఆర్ పేర్కొన్నారు.
అందులో భాగంగానే హెచ్ఎండిఏ చట్టంలో స్పష్టంగా ప్రస్తావించిన మేరకు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం హైదరాబాద్ నగరానికి మరింత ప్రాచుర్యం తీసుకురావచ్చన్న నిబంధనల మేరకు రేస్‌ని హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. హెచ్ఎండీఏ వైస్ చైర్మన్ హోదాలో ప్రిన్సిపల్ సెక్రెటరీతో కలిసి నిర్ణయం తీసుకొని ఆ మేరకు నిబంధనల మేరకు ఫైల్ సర్కులేట్ చేసి ఫార్ములా ఈ నిర్వహణ సంస్థకు డబ్బులు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నాము. అందులో భాగంగానే సుమారు 55 కోట్ల రూపాయలను రెండు విడతల్లో చెల్లించాము అని స్పష్టం చేశారు.
అయితే తదుపరి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉన్నదని ఫార్ములా-ఈ సంస్థ డిసెంబర్ 7 నాడు ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది. ఫార్ములా-ఈ సహ వ్యవస్థాపకుడు ఆల్బర్ట్ లొంగోతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పటి పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ సమావేశం అయ్యారు. సమావేశం అత్యంత సానుకూలంగా జరిగిందని నూతన ప్రభుత్వం కూడా ఈ రేసులను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది అని అన్నారు.
అయితే డిసెంబర్ 13న జరిగిన ముఖ్యమంత్రి సమావేశం అనంతరం డిసెంబర్ 19న మరొకసారి ఫార్ములా-ఈ సంస్థ రానున్న రేస్ నిర్వహణ కోసం ప్రభుత్వం చెల్లించాల్సిన కాంట్రాక్టు నిబంధనలను ఫీజుల గురించి ప్రస్తావించింది. డిసెంబర్ 21 నాటికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పాలని లేకుంటే రేసును నిర్వహించే పరిస్థితి తమకు ఉండదని తెలిపింది. డిసెంబర్ 22వ తేదీన సంస్థ లీగల్ డైరెక్టర్ దాన కిషోర్‌కు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. మరో నాలుగు రోజులపాటు అంటే డిసెంబర్ 26వ తేదీ నాటికి గడువు ఇచ్చి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తమతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించకపోవడంతో హైదరాబాద్ నగరంలో రేసులు నిర్వహించలేమని స్పష్టంగా తెలియజేసింది అని అన్నారు.
అయితే ఫార్ములా-ఈ నిర్వాహక సంస్థ ఎఫ్ఐఈకి చెల్లించిన 73 లక్షల రూపాయల రేస్ ఫీజులను కూడా తిరిగి పంపించింది. భారతదేశ విభాగమైన ఎఫ్ఎంఎస్సీఐ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి ఈ డబ్బులు తీసుకోమని చాలాసార్లు కోరిన ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులను తీసుకోలేదు. 55 కోట్ల రూపాయల నిధులను రెండు వాయిదాలలో తమకు ముట్టిన విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ.. తదుపరి మూడవ వాయిదా గురించి స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వంతో పలుసార్లు లేఖల రూపంలో ఫార్ములా ఈ సంస్థ సంభాషణలు కొనసాగించింది అని తెలిపారు.
అత్యంత చట్టబద్ధంగా పారదర్శకంగా హెచ్ఎండిఏ ఇండియన్ ఓవర్సీస్ ప్రభుత్వ బ్యాంకు నుంచి ఈ నిధులను ఆ సంస్థకు చెల్లించింది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కి విదేశీ సంస్థకు నిధులు చెల్లించింది అని ఈ రాష్ట్ర ప్రభుత్వము మతిలేని మాటలను మాట్లాడుతుంది. కేవలం కాంగ్రెస్ పార్టీకి ఈ క్రీడల వలన జరిగే ప్రయోజనాలను అర్థం చేసుకునే తెలివిలేకపోవడం వలనే కాంట్రాక్టును రద్దు చేసుకుంది. దీనివలన భారతదేశంలో పాటు హైదరాబాద్ మరియు తెలంగాణ పరువు అంతర్జాతీయ స్థాయిలో పోయింది అని మండిపడ్డారు.
ఈ మేరకు ఫార్ములా-ఈ భాగస్వాములు అయినటువంటి పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, రాష్ట్ర ప్రభుత్వంపైన తీవ్రంగా విమర్శలు చేశారు గతంలో ఫార్ములా-ఈ ని మాంట్రియల్ అనే నగరంలో ఇదేవిధంగా అక్కడ స్థానిక పట్టణ ప్రభుత్వం మారడం వలన నూతన ప్రభుత్వం రద్దు చేసుకోవడం జరిగింది. ఫార్ములా-ఈ సంస్థ మాంట్రియల్ నగరంపైన నష్టపరిహారం కేసు వేసి సుమారు మూడు మిలియన్ డాలర్లను నష్టపరిహారంగా పొందింది. అదేవిధంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హరీష్ సాల్వే అనే ప్రముఖ న్యాయవాదితో ఫార్ములా-ఈ తెలంగాణ ప్రభుత్వంపైన వేసిన కేసును రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టింది అని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం కేవలం అబద్ధాలను, అసత్యాలను మాత్రమే ఈ సందర్భంగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ప్రభుత్వ డబ్బులు నేరుగా క్రీడా సంస్థ బ్యాంకులోకి ప్రభుత్వ రంగ బ్యాంకు ద్వారా చేరినప్పుడు అవినీతి అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు
కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఫార్ములా-ఈ సంస్థతో జరిపిన సంభాషణలు, రేస్ నిర్వహణ కోసం అంగీకరించిన నిర్ణయం, ఆ తర్వాత కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించి రేస్ నుంచి తప్పుకోవడం, డబ్బులు చెల్లించకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపైన ఫార్ములా-ఈ నమోదు చేసిన కేసును, ఫార్ములా-ఈ సంస్థ కాంట్రాక్టు ప్రకారం డబ్బులు వెనక్కి తీసుకోమని కోరినా స్పందించకపోవడం వంటి అంశాలు అన్నింటిని దాచిపెట్టింది అని ధ్వజమెత్తారు.
అసలు అవినీతి అనేది జరగనే లేనప్పుడు.. జరిగిన ప్రతి లావాదేవీ యొక్క వివరాలు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు ఏసీబీ సంస్థ కేసు నమోదు చేసే పరిధి లేనేలేదు అవినీతి జరగనే లేనప్పుడు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దివాలాకోరుతనానికి నిదర్శనం అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్