mt_logo

డెంగీ జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదు: కేటీఆర్

రాష్ట్రంలో డెంగీ జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 6,000 డెంగీ కేసులు నమాదైనప్పటికీ ప్రభుత్వం మాత్రం లెక్కలను దాచే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. గత 5 రోజుల్లోనే 800 కొత్త డెంగీ కేసులు నమాదైనట్లు ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ డైరెక్టరే నిర్ధారించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

డెంగీ మహమ్మరి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. విష జ్వరాల వ్యాప్తిని నివారించే చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం డెంగీ మరణాల లెక్కలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తుండటం దురదృష్టకరమని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారదర్శకంగా విష జ్వరాల నివారణ కోసం చర్యలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు.