mt_logo

కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోంది: కేటీఆర్

పదేళ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నేరపూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తోంది. నేతన్నల బతుకుకు భరోసా ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపివేసి వాళ్ల పొట్ట కొట్టటం న్యాయమేనా అని అడిగారు.

ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారికి ఉపాధి లేకుండా చేయటమా? ఇది ప్రజాపాలనా? ప్రజల ప్రాణాలు తీసే పాలనా? సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మొద్దు నిద్ర నటిస్తున్నారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే మీకు సోయి వస్తుంది అని దుయ్యబట్టారు.

సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే చర్యలను వెంటనే చేపట్టాలి. మరొక్క ప్రాణం పోయినా అది ప్రభుత్వం చేసిన హత్యగానే భావించాల్సి ఉంటుంది. నా మీద కోపంతో నేతన్నల ప్రాణాలు బలి పెట్టవద్దు ముఖ్యమంత్రి గారు. వారికి మా కన్నా ఎక్కువ మంచి చేసి వారి ప్రాణాలు నిలబెట్టండి అని కేటీఆర్ కోరారు.