mt_logo

అందరివాడు.. మన నిజామాబాద్ రైతుబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్: కేటీఆర్

క‌ష్టాల్లో, క‌న్నీళ్ల‌లో జ‌నం తోడుంటూ.. అంద‌రివాడుగా.. నిజామాబాద్ ప్ర‌జ‌ల ముద్దుబిడ్డ‌గా ఎదిగిన రైతుబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు.

అహంకారంతో, మ‌తాల పేరుతో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతూ.. విద్వేషాల‌ను నింపుతూ సాగుతున్న నిజామాబాద్ రాజ‌కీయాల్లో సౌమ్యుడిగా ప్ర‌జ‌లందరి ఆప్తుడిగా ప‌నిచేస్తున్న నాయ‌కుడు బాజిరెడ్డి అని పేర్కొన్నారు.

ఏ ప‌ద‌విలో ఉన్న ప్రజా సంక్షేమం కోస‌మే పాటుప‌డుతూ, కేసీఆర్ గారి సైనికుడిలా భుజం క‌లిపి ప‌ని చేసే ప్రజా నాయకుడు.. పంచ‌క‌ట్టుతో.. ప్రేమ‌తో.. మాట‌లు కాదు చేత‌ల్లో చేసి చూపించే నిఖార్సైన‌ మ‌న నిజామాబాద్ బిడ్డ‌ బాజిరెడ్డి అని తెలిపారు

సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ గారి గ‌ళం.. నిజామాబాద్‌కు బ‌లం. విద్వేష రాజ‌కీయాల‌కు చెక్ పెడ‌దాం.. కారు గుర్తుపై ఓటేసి బాజిరెడ్డి గారినే గెలిపించుకుందాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు