mt_logo

నర్సాపూర్‌లో రైతులతో ముచ్చటించిన హరీష్ రావు

మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో వడ్ల కల్లంలో ఉన్న రైతుల వద్దకు వెళ్లి మాజీ మంత్రి హరీష్ రావు ముచ్చటించారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏ విధమైన అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వారికి వివరించారు.

ఈ మేరకు మల్లేశం, సత్యనారాయణ అనే కౌలు రైతులతో మాట్లాడుతూ ‘కౌలు రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15,000..  క్వింటాలుకు రూ. 500 పంట బోనస్ ఇస్తమని కాంగ్రెసోళ్లు చెప్పిరి కదనే ఇచ్ఛిర్రా మరి?’ అని అడిగారు. దానికి రైతులు బదులిస్తూ.. ‘ఏ బోనస్ లేదు సార్. ఈ పైసలే తొందరగా టైంకు అకౌంట్లో పడితే చాలు’ అన్నారు.

అదే విధంగా రూ. 2 లక్షల రైతు రుణమాఫీ కూడా చేయలేదని మరికొందరు రైతులు వారి గోసను వెలిబుచ్చారు. అక్కడే ఉన్న ఇంకో మహిళా రైతును హరీష్ రావు పలకరిస్తూ.. ‘ఆడబిడ్డలకు ఇస్తానన్న రూ. 2, 500, తులం బంగారం సంగతి ఏమైందమ్మ ఇచ్చిర్రా? అని అడగగా.. ‘ఎక్కడ ఇచ్చారు సార్. ఏవి ఇయ్యలేదు. ఓటు వేసే దాక ముచ్చట్లు చెప్పి, ఇప్పుడు వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు’ అంటూ ఆ మహిళా రైతు వాపోయింది.