నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీ టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాయలో పడి తెలంగాణ టీడీపీ నేతలు చరిత్రహీనులుగా అవుతున్నారని అన్నారు.
విలేకరులతో మాట్లాడుతూ,’గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది. తన మెడ తెగేవరకూ కూడా మోసపోయానని తెలుసుకోలేకపోతుంది. చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నా టీడీపీ నేతలు తెలుసుకోలేకపోతున్నారు.’ అని చెప్పారు.
హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని అంటున్న చంద్రబాబు నగర అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని, హైటెక్ సిటీ చుట్టూ తన వారికే వేల కోట్ల రూపాయల భూములను ధారాదత్తం చేశారని, చారిత్రక కట్టడాలన్నీ నిజాముల కాలంనాటివే అని కోమటిరెడ్డి వివరించారు. హైదరాబాద్ పై సీమాంధ్రులకు ఎటువంటి హక్కులు ఉండబోవన్నారు.