తెలంగాణ రైతాంగ పోరాట యోధ, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా వారందించిన పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. అణిచివేతకు గురైన బలహీనవర్గాల తిరుగుబాటుతత్వానికి, ప్రతిఘటనా పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.
తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, అస్థిత్వ ఉద్యమంలో, స్వయం పాలన కోసం కొనసాగిన పోరాటంలో, పెద్ద ఎత్తున బహుజనులు భాగస్వామ్యం కావడం వెనక నాటి వారి పోరాట స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ తెలిపారు.
చిట్యాల ఐలమ్మ ఆకాంక్షలకు అనుగుణంగానే.. పదేండ్ల బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర తొలిప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ, ప్రగతి కార్యాచరణను అమలుచేసిందన్నారు.
దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ సబ్బండ వర్గాలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలతో పలు పథకాలను అమలుచేసి వారిని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక గా నిలిపిందన్నారు.
ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనాతత్వం ఎల్లవేళలా ఆదర్శమని కేసీఆర్ తెలిపారు. ఐలమ్మ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించే దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి జయంతిని అధికారంగా నిర్వహించాలని నిర్ణయించి అమలుచేసిందన్నారు.
బలహీనవర్గాలు, నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయడమే ఐలమ్మకు మనమర్పించే ఘన నివాళి అని కేసీఆర్ తెలిపారు.
- Is Meinhardt replicating Pakistan’s failed model for the Musi Beautification Project?
- Why did Revanth select controversial Meinhardt company for the Musi Beautification Project?
- Revanth & Co’s frequent foreign trips: A drain on Telangana’s exchequer
- KTR accuses Congress govt. of implementing ‘bulldozer culture’ in Telangana
- Why did cost of Musi Beautification Project soar to Rs. 1.5 lakh cr?
- కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్
- భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన రతన్ టాటా ఎందరికో ప్రేరణ: కేటీఆర్
- ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా: కేసీఆర్
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నాడు: హరీష్ రావు
- యూపీలో లాగా తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చాడు: కేటీఆర్
- ఏడు గ్యారెంటీల కాంగ్రెస్ గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారు: కేటీఆర్
- 10 లక్షల మంది గురుకుల విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ గ్యారెంటీల మోసం నుండి తప్పించుకున్న హర్యానా!
- సోషల్ మీడియాను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా?: జగదీశ్ రెడ్డి