వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తికి ప్రతీక అని.. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికి ఆదర్శం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు ఐలమ్మ.. బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావటానికి ఆమెనే స్ఫూర్తి అని అన్నారు.ఉద్యమ పోరాటాల్లో మహిళల పాత్ర అసమానమైనది చాటి చెప్పి యోధురాలు ఐలమ్మ. ఇవ్వాళ ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాలిని స్మరించుకోవటం గొప్ప అవకాశం అని అన్నారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పాలన సాగింది. బడుగులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ ఐలమ్మను ఘనంగా స్మరించుకున్నాం అని గుర్తు చేశారు.
చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డాక.. కేసీఆర్ గారు ప్రత్యేక చొరవతో ఐలమ్మ గారి జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారు. పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారు. చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు అని తెలిపారు.
ఐలమ్మ ఆకాంక్షలను నిత్యం ముందుకు తీసుకెళ్లటంలో బీఆర్ఎస్ ముందుంటుంది. పేదలు, బడుగుల కోసం పరితపించిన ఐలమ్మ ఆశయాలను కొనసాగించటమే ఆమెకు మనమిచ్చే ఘన నివాళి అని కేటీఆర్ పేర్కొన్నారు.
- Why did Revanth select controversial Meinhardt company for the Musi Beautification Project?
- Revanth & Co’s frequent foreign trips: A drain on Telangana’s exchequer
- KTR accuses Congress govt. of implementing ‘bulldozer culture’ in Telangana
- Why did cost of Musi Beautification Project soar to Rs. 1.5 lakh cr?
- Fearing backlash, saree distribution to women’s groups in 6 districts halted
- కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్
- భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన రతన్ టాటా ఎందరికో ప్రేరణ: కేటీఆర్
- ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా: కేసీఆర్
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నాడు: హరీష్ రావు
- యూపీలో లాగా తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చాడు: కేటీఆర్
- ఏడు గ్యారెంటీల కాంగ్రెస్ గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారు: కేటీఆర్
- 10 లక్షల మంది గురుకుల విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ గ్యారెంటీల మోసం నుండి తప్పించుకున్న హర్యానా!
- సోషల్ మీడియాను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా?: జగదీశ్ రెడ్డి