mt_logo

14 ఏళ్ల నాటి ముడుపు విప్పనున్న కేసీఆర్..

తెలంగాణ స్వప్నం సాకారం కావాలని 14 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా మోతెలో కట్టిన మట్టి ముడుపును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 28న విప్పనున్నారు. 2001లో మోతె గ్రామస్తులు మొత్తం తెలంగాణ కోసం టీఆర్ఎస్ లో చేరారు. అన్ని రాజకీయ పార్టీలను, తెలంగాణ వ్యతిరేక పత్రికలను గ్రామం నుంచి వెలేశారు. ఈ విషయం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. స్థానిక ఎన్నికల్లో వంద గ్రామాల్లోని ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా పర్యటన సందర్భంగా మోతె గ్రామానికి వచ్చిన కేసీఆర్ గ్రామంలో మట్టిని అతిపవిత్రంగా భావించి ఆ మట్టిని ముడుపుకింద మూటకట్టారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతే ముడుపును విప్పుతానని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సందర్భంలో మరో మూడు రోజుల్లో మోతె గ్రామానికి వెళ్లి అక్కడే కేసీఆర్ ముడుపు విప్పనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *