mt_logo

ఆంధ్రా డబ్బాల గోల మళ్ళీ మొదలైంది..

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఆంధ్రా మీడియా తెలంగాణపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది. టీఆర్ఎస్ పార్టీపై విషం చిమ్ముతూ బోగస్ సర్వేలు చేసి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మళ్ళీ ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, షబ్బీర్ అలీ తోడ్పాటుతో ఎన్టీవీ డైరెక్టర్ నరేంద్రనాథ్ చౌదరి సర్వే రిపోర్టులనే మార్చిపడేశారు. నేషనల్ ఛానల్స్ ఎన్డీటీవీ, సీఎన్ఎన్, ఐబీఎన్, హెడ్ లైన్స్ టుడే దేసవ్యాప్తంగా నిర్వహించిన 20 సర్వేలలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ దే అధికారం అని చెప్తుంటే నకిలీ ఎస్ఎంఎస్ లతో ఎన్టీవీ కుట్రలు పన్నుతుంది. ఎన్టీవీ కథనాలను తెలంగాణ ఓటర్లు నమ్మొద్దని టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది.42 శాతం ఓట్లతో టీఆర్ఎస్ దే హవా అని సీఎన్ఎన్-ఐబీఎన్, 17 ఎంపీ సీట్లలో 11 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ వే అని ఎన్డీటీవీ తెలిపిందని టీఆర్ఎస్ పార్టీ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని కూడా సర్వేలు చెప్పినా సీమాంధ్ర మీడియా వక్రబుద్ధి చూపెట్టడం మానకపోతే తగిన మూల్యం చెల్లించాల్సివస్తుందని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలను ప్రభావితం చేసేందుకే బోగస్ సర్వేలు చేస్తుందని, టీఆర్ఎస్ హవాను అడ్డుకునేందుకే తప్పుడు సర్వేలని ఎన్టీవీపై రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్ మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ మరింత బలపడుతుందని ఆయన చెప్పారు. ఉద్యమకారులకు పని పెట్టి రెచ్చగొట్టవద్దని ఎన్టీవీ చౌదరిని హెచ్చరించారు. మరోవైపు టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ కూడా ఇదే విషయంపై మాట్లాడారు. తెలంగాణపై విషప్రచారం చేస్తున్న సీమాంధ్ర మీడియా, పార్టీలు మాకొద్దని బాల్క సుమన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు అధికారంలోకి తెస్తారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *