mt_logo

తెలంగాణకు కేసీఆర్ అవసరం..

భారత పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) ప్రతినిధులు సోమవారం టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిసి తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఒక నివేదికను ఆయనకు అందజేశారు. సీఐఐ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేష్ చిత్తూరి మాట్లాడుతూ, తెలంగాణలో పరిశ్రమల స్థాపనలో ఉన్న సమస్యలను కేసీఆర్ కు వివరించామని, తెలంగాణలో పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కోత లేకుండా చూడాలని ఆయనను కోరామని చెప్పారు. అన్ని సమస్యలనూ విన్న తర్వాత కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, మరోసారి కలిసి తెలంగాణకు ఏం కావాలి? ఎలా ఉండాలనే దానిపై సంపూర్ణ నివేదికను అందజేస్తామని వివరించారు. కేసేఆర్ తో మాట్లాడినతర్వాత తమకు చాలా సంతోషంగా ఉందని, తెలంగాణకు కేసీఆర్ అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐఐ ప్రతినిధులు వనిత దాట్ల, రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *