రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళలల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ సిద్ధమవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళలు తీవ్రమైన రక్తహీనత, పిల్లలు పోషకాహారలోపంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో 15 నుంచి 49 ఏండ్లలోపు యువతులు, మహిళల్లో రక్తహీనత ఆందోళనకరంగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి బలమైన పౌష్ఠికాహారాన్ని అందించాలని సంకల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్‌లో ఉండాల్సిన పోషకాలపై శాస్త్రీయ అధ్యయనం చేసింది. వెన్న, కర్జూర, ప్రొటీన్ బిస్కెట్స్, ఐరన్ క్యాప్సూల్స్‌తో కూడిన కిట్ల బాధ్యతను తెలంగాణ ఫుడ్స్‌కు అప్పగించింది. తొలిదశలో ఈ కిట్స్‌ను ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్, ములుగు, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌లో ప్రారంభించి, తరువాత మిగతా జిల్లాలకు విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్