తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న మరో ప్రతిష్టాత్మక పథకం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. గర్భిణీ స్త్రీలను రక్తహీనత బారినుండి కాపాడే ఈ పథకాన్ని వచ్చే ఏప్రిల్ నుండి రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేసీఆర్ కిట్ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తూ… కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 2017, జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 13 లక్షల 29 వేల 951 మందికి లబ్ధి చేకూరింది. ఈ పథకం అమలు కోసం రూ.1387 కోట్ల 19 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ఉంటే.. ప్రసవాల సంఖ్య 54 శాతానికి పెరిగిందన్నారు. గతంలో ప్రసవాలకు వచ్చిన తల్లుల మరణాలు ప్రతి లక్షకు 94 ఉండేదని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కిట్ అమలుతో తల్లుల మరణాలు ఇవాళ 63కు తగ్గించామన్నారు. శిశు మరణాలను కూడా తగ్గించుకున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులను పెద్ద ఎత్తున కల్పించామన్నారు. కొత్తగా 23 మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. న్యూట్రిషన్ కిట్ పథకం త్వరలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇలాంటి వారికి న్యూట్రిషన్ కిట్ అందిస్తామన్నారు. కుమ్రం భీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల్, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
- Telangana faces injustice in union railway budget too
- Gift A Smile: KTR distributes laptops to 100 students at State Home on his birthday
- Revanth becomes a laughing stock at national level over ‘family politics’ remarks
- No funds for Telangana’s Regional Ring Road in union budget
- Loans waived for farmers who never took them: Kamareddy farmers suspect fraud
- పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్
- శ్రీధర్ బాబు ముందరి కాళ్లకు బంధం వేస్తున్నదెవరు? (పార్ట్-1)
- నీళ్లు వృథా పోతుంటే ఎత్తిపోయకుండా రైతుల నోట్లో మట్టి కొడతారా: కేటీఆర్
- ఆగస్టు 2 గడువు.. తర్వాత 50 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్‌ను స్టార్ట్ చేస్తాం: కేటీఆర్
- ఎండిపోతున్న ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లు నింపాలి: కేటీఆర్
- ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ.. ఇది దశా, దిశా లేని బడ్జెట్: హరీష్ రావు
- ఐఐటీ గౌహతిలో సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని దీప్తికి కేటీఆర్ అండ
- ఒక పద్దు లేదు.. పద్ధతి లేదు.. బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్: కేసీఆర్
- మేడిగడ్డ బరాజ్‌లో సమస్య ఎందుకు వచ్చింది? మేడిగడ్డ గురించి తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
- గిఫ్ట్ ఏ స్మైల్: ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం