mt_logo

కేసీఆర్ కిట్ అద్భుతం!!

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జాతీయ నాణ్యతా ప్రమాణాల తనిఖీ బృందం పరిశీలించింది. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఈ పథకం ఉందని, దీనిని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావుపై ఆ బృందం ప్రశంసలు కురిపించింది. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవం చేసుకున్న వారికి ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగపిల్లాడు అయితే రూ. 12 వేలు ఇస్తున్నట్లు, అంతేకాకుండా 16 రకాల వస్తువులు కూడా కేసీఆర్ కిట్ లో ఇస్తున్నట్లు సిబ్బంది తెలపడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తనిఖీ బృందం సభ్యులు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అవార్డు అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సేవలు అందిస్తున్న పలు ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న ఆరోగ్య కేంద్రంగా గంగాధరలోని దవాఖానా ముందు వరుసలో ఉండడంతో జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం అందించడానికి పరిశీలించామని వారు తెలిపారు. ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్, ల్యాబ్, ప్రసవాల గది, దవాఖానలో పరిశుభ్రత, సాధారణ పరిపాలన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు, 70 శాతం మార్కులు సాధించిన ఆరోగ్య కేంద్రం పురస్కారానికి ఎంపిక అవుతుందని బృందం సభ్యులు పేర్కొన్నారు. ఎంపికైన దవాఖానకు జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు పత్రంతో పాటు, రూ. 3 లక్షల చొప్పున మూడేళ్ళు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *