పాలమూరు జిల్లాకు చెందిన అప్పరసు కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అప్పరసు కృష్ణారావు సాహిత్య రంగంలో, పాత్రికేయ వృత్తిలో మరింత ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి పేరు తేవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.