అసెంబ్లీలో సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో స్పీకర్ ఆమోదించగానే బిల్లు తిరస్కరించబడినట్లేనని సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం చేయడం పట్ల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, తెలంగాణ వ్యతిరేక వార్తలు వ్రాస్తూ శునకానందం పొందుతున్నారని, రేపు తెలంగాణలో ఏ మొహం పెట్టుకుని ఉంటారని ఘాటుగా ప్రశ్నించారు. మీ పత్రికల్లో బ్యానర్ వార్తలు రాసినంత మాత్రాన తెలంగాణ ఏర్పాటును అడ్డుకోగలరా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో స్పీకర్ సీఎం తీర్మానాన్ని స్వీకరించగానే సమైక్య సింహాలు, సమైక్య కిరణం అని పిచ్చిపిచ్చిగా ప్రసారం చేయడం మీకే దక్కిందని కేసీఆర్ సీమాంధ్ర మీడియాపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన బిల్లును పంపింది రాష్ట్రపతి అని, అది అసెంబ్లీ బిల్లు కాదని తెలిసికూడా సీమాంధ్ర నేతలు ఓటింగ్ కు పట్టుబట్టడం అర్థంలేనిదని, కేంద్రానికే రాష్ట్రాలను విభజించే అధికారం ఆర్టికల్ 3ప్రకారం ఉందన్నారు. పనికి రాని క్యాప్షన్స్ పెడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలోనిదని, సీమాంధ్ర నేతలు, సీమాంధ్ర మీడియా ఏం చేసినా లాభంలేదని ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే బాగుండదని సూచించారు.
- Police Act enforced in 20 districts; Is Telangana turning into a ‘Police State’?
- Fact Check: Congress government didn’t increase diet charges by 40%
- Local bodies to lose relevance with HYDRAA’s excessive powers
- Caste census: Govt. schools to remain partially shut for next 3 weeks
- Steep hike in liquor prices likely on the cards to generate additional revenue
- హెచ్ఎండీఏ పరిధిలోని జీపీ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ పెట్టడం మూర్ఖపు చర్య: కేటీఆర్
- హామీల అమలు విషయంలో రాష్ట్ర, దేశ ప్రజలను రేవంత్ తప్పుదోవ పట్టిస్తునాడు: హరీష్ రావు
- పదేళ్లు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి: కేటీఆర్
- Karnataka Congress govt. to scrap free bus travel for women soon?
- పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర: కేటీఆర్
- తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
- కేటీఆర్ ప్రశ్నించే గొంతుక.. కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు: హరీష్ రావు
- కాంగ్రెస్ హామీలపై ప్రశ్నించిన వ్యక్తిని మహబూబ్‌నగర్‌లో సీఐ కొట్టడంపై కేటీఆర్ సీరియస్
- రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో డ్రగ్స్ టెస్ట్‌కు రావాలి: కౌశిక్ రెడ్డి
- దుబాయిలో రేవంత్ ఏం చేశాడో బయటపెడితే ఇంటికి వెళ్ళలేడు: కౌశిక్ రెడ్డి