mt_logo

సీమాంధ్ర ఛానళ్ళపై నిప్పులు చెరిగిన కేసీఆర్

అసెంబ్లీలో సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో స్పీకర్ ఆమోదించగానే బిల్లు తిరస్కరించబడినట్లేనని సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం చేయడం పట్ల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, తెలంగాణ వ్యతిరేక వార్తలు వ్రాస్తూ శునకానందం పొందుతున్నారని, రేపు తెలంగాణలో ఏ మొహం పెట్టుకుని ఉంటారని ఘాటుగా ప్రశ్నించారు. మీ పత్రికల్లో బ్యానర్ వార్తలు రాసినంత మాత్రాన తెలంగాణ ఏర్పాటును అడ్డుకోగలరా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో స్పీకర్ సీఎం తీర్మానాన్ని స్వీకరించగానే సమైక్య సింహాలు, సమైక్య కిరణం అని పిచ్చిపిచ్చిగా ప్రసారం చేయడం మీకే దక్కిందని కేసీఆర్ సీమాంధ్ర మీడియాపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన బిల్లును పంపింది రాష్ట్రపతి అని, అది అసెంబ్లీ బిల్లు కాదని తెలిసికూడా సీమాంధ్ర నేతలు ఓటింగ్ కు పట్టుబట్టడం అర్థంలేనిదని, కేంద్రానికే రాష్ట్రాలను విభజించే అధికారం ఆర్టికల్ 3ప్రకారం ఉందన్నారు. పనికి రాని క్యాప్షన్స్ పెడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలోనిదని, సీమాంధ్ర నేతలు, సీమాంధ్ర మీడియా ఏం చేసినా లాభంలేదని ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే బాగుండదని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *