mt_logo

కవిత అరెస్ట్ బీజేపీ-కాంగ్రెస్ రాజకీయ కుట్ర.. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: బీఆర్ఎస్

ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, కాంగ్రెస్ కలిపి కుట్ర చేసి అరెస్ట్ చేశాయని, దీనిపై రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడటానికి సిద్ధమని తెలిపింది.

మహిళలను ఈడి అరెస్టు చేయొచ్చా, చేయొద్దా అనే అంశం కోర్టులో ఉంది. మమతా బెనర్జీ కుటుంబ సభ్యురాలి పైన, నలిని చిదంబరం పైన, కవిత  పైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు విచారిస్తున్నది. ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంటే, మూడు రోజుల ముందే అరెస్టు చేయడం అంటే, పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీసే కుట్రే అని బీఆర్ఎస్ ఆరోపించింది.