mt_logo

బాబు బాధితుడా! వంచకుడా!

By: కట్టా శేఖర్ రెడ్డి..

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయుడు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబాబు ఇప్పుడు తీరా ఎన్నికల ముందు బాధితుడిగా, వేధితుడిగా పోజు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతకాలం అధికార యంత్రాంగం, న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థలను ఇష్టారాజ్యంగా వాడేసుకున్న చంద్రబాబునాయుడు ఇప్పుడు వాటికి అడ్డుకట్టపడేసరికి వలవల వాపోతున్నారు. అధికారులను పార్టీ కార్యకర్తలకంటే హీనంగా వాడుకున్న చంద్రబాబు, ఎన్నికల సంఘం అధికార యంత్రాంగంతో తెగదెంపులు చేసేసరికి కుతకుత ఉడికిపోతున్నారు. ప్రపంచమంతా తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నదన్న బిల్డప్ ఇస్తున్నారు. ఆంధ్ర ఎన్నికలలో అసలు సీనులో లేని నరేంద్ర మోదీ, కేసీఆర్‌లను జగన్‌తో కలిపి తిడుతూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నా రు. నోటికి ఎంతమాట వస్తే అంత మాట అనేస్తున్నారు. నరేంద్ర మోదీని ఉన్మాది, దుర్మార్గుడు వంటి తిట్లు కూడా తిట్టేశారు. అమిత్‌షాను ఆంధ్ర నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. పరాజయభయంతో ఆయన ఇంగితం కోల్పోయి మాట్లాడుతున్నారు. అయ్యల చక్కదనం అధికారాంతమున చూడవలె అన్నారు. చంద్రబాబు అసలు చక్కదనం ఇప్పుడు నానాటికీ బట్టబయలవుతున్నది. ఎవరు చేసిన పాపాలు వారిని వెంటాడుతాయని చంద్రబాబు గుర్తించలేకపోయారు. తనను తాను ఎక్కువ ఊహించుకొని, తన బలాన్ని ఎక్కువ అంచనా వేసుకొని, ఎక్కడపడితే అక్కడికి యుద్ధాలు చేయడానికి బయలుదేరితే ఇలాగే మాడపగులుతుందని ఆయన తెలుసుకోవాలి. చంద్రబాబునాయుడు ఒకవైపు పేద అరుపులు అరుస్తూనే మరోవైపు పక్కరాష్ట్రాలకు వందలకోట్ల రూపాయల ఎన్నికల నిధులు ఎలా పంపిస్తున్నారో ఆంధ్ర ప్రజలకు అర్థం కాకపోదు.

ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో పౌరుషం రెచ్చగొట్టండి అని చంద్రబాబు పిలుపు ఇవ్వడాన్ని ఒక ఉన్మాద నినాదంగా కాక ఏమనుకోవాలి? ఏమని పౌరుషం రెచ్చగొట్టాలి? ఎవరికి వ్యతిరేకంగా పౌరుషం రెచ్చగొట్టాలి? పోలవరం ఆగిపోతదట. పోతిరెడ్డిపాడు మూతపడుతదట. హంద్రీనీవా నిలిచిపోతదట. ఈ మూడు ప్రాజెక్టులను తెలంగాణ అభీష్టానికి వ్యతిరేకంగా, ఎటువంటి అనుమతులు లేకుండా ప్రారంభించింది, అరవై, డెబ్భయి శాతం పనులు పూర్తిచేసింది వైఎస్ రాజశేఖర్‌ రెడ్డే. చంద్రబాబు చేసింది అతుకుల పనులే. చంద్రబాబువి ఏమన్నా ఒళ్లూ సోయి ఉండి చెప్పే మాటలేనా? చంద్రబాబు ఇంతగా దిగజారి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన మళ్లీ హైదరాబాద్‌కు రాడా? తెలంగాణలో అసలు ఉండరా? తెలంగాణ, ఆంధ్ర కలిసి జీవించలేవా? శాశ్వతంగా రెండు ప్రాంతాలు శత్రు శిబిరాలుగా ఉండిపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నారా?

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఆ గెలుపు కూడా తనదే అని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు చంద్రబాబు. అంటే అక్కడ ప్రచారం చేయలేదు. కానీ, ఆ రాష్ట్రాలలో ఎన్నికలలో కొట్లాడటానికి కాంగ్రెస్‌కు ఎన్నికల నిధులు సమకూర్చారని అర్థం చేసుకోవాలి. తెలంగాణలో తగుదునమ్మా అంటూ వచ్చి ఎంత రచ్చ చేశారో, తెలంగాణ ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో మొన్న మొన్నటి జ్ఞాపకమే. ఇన్ని చేసినా కేసీఆర్ ఆంధ్ర ఎన్నికల జోలికి వెళ్లలేదు. చంద్రబాబు చేసే లక్ష కోట్ల అవినీతి ఆరోపణలను బట్టి జగన్‌కు అసలు ఎన్నికల నిధులు సమకూర్చవలసిన అవసరమే లేదు. చంద్రబాబునాయుడు గతేడాది వ్యవధిలో అన్ని మర్యాదల పరిమితులనూ దాటి రెచ్చిపోయి వ్యవహరించారు. ఎవరినో ఉన్మాది అనడం కాదు కానీ, ఆయనే ఒక ఉన్మాద స్థితి కి దిగజారిపోయి మాట్లాడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో పౌరుషం రెచ్చగొట్టండి అని చంద్రబాబు పిలుపు ఇవ్వడాన్ని ఒక ఉన్మాద నినాదంగా కాక ఏమనుకోవాలి? ఏమని పౌరుషం రెచ్చగొట్టాలి? ఎవరికి వ్యతిరేకంగా పౌరుషం రెచ్చగొట్టాలి? పోలవరం ఆగిపోతదట. పోతిరెడ్డిపాడు మూతపడుతదట. హంద్రీనీవా నిలిచిపోతదట. ఈ మూడు ప్రాజెక్టులను తెలంగాణ అభీష్టానికి వ్యతిరేకంగా, ఎటువంటి అనుమతులు లేకుండా ప్రారంభించింది, అరవై, డెబ్భయి శాతం పనులు పూర్తిచేసింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డే. చంద్రబాబు చేసింది అతుకుల పనులే. చంద్రబాబువి ఏమన్నా ఒళ్లూ సోయి ఉండి చెప్పే మాటలేనా? చంద్రబాబు ఇంతగా దిగజారి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన మళ్లీ హైదరాబాద్‌కు రాడా? తెలంగాణలో అసలు ఉండరా? తెలంగాణ, ఆంధ్ర కలిసి జీవించలేవా? శాశ్వతంగా రెండు ప్రాంతాలు శత్రు శిబిరాలుగా ఉండిపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నారా? చంద్రబాబుకు అధికారం ఒక వ్యసనం. అది లేకపోతే బతుకలేమన్న స్థితికి వచ్చారు.

అందుకే విచక్షణ, వివేకం మరిచి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అందుకు కారణం ఎదురుగా పరాజయం కనిపిస్తున్నది. నిన్న తమ పార్టీ నాయకులపై ఐటీ దాడులు జరిపినందుకు నిరసనగా చంద్రబాబు ధర్నాకు కూర్చున్నారు. పట్టుమని వందమంది లేరు. ఆయన పదేపదే చెప్పే అబద్ధాలు విసుగు పుట్టిస్తున్నాయి. అస్తమానం కేసీఆర్, మోదీల ప్రస్తావన తేవడం ప్రజలకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. సీన్లో లేనివాళ్ల గురించి ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నారని జనం విసుక్కుంటున్నారు. నిజానికి ఆయన చేసిన కొన్ని పనులైనా చెప్పుకుంటే ఇంకా ఎక్కువ స్పందన ఉండేది. ఎంతోకొంత ఆయనకు మేలు జరిగి ఉండేది. ఆయన అమలుచేస్తున్న పథకాల గురించి చెప్పుకొని మరో అవకాశం ఇవ్వమని అడిగి ఉంటే ఇంకా ఎక్కువ సానుకూల స్పందన వచ్చి ఉండేది అని గుంటూరుకు చెందిన ఒక రాజకీయ పరిశీలకుడు చెప్పారు. అన్నింటికీ మించి ఎన్నికల సర్వేలు, పండితుల అంచనాలు అన్నీ చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తున్నాయి. సెంటర్ ఫర్ సెఫాలజీ సర్వే జగన్ గాలి వీస్తున్నదని పేర్కొంది. టైమ్స్ నౌ సర్వే కూడా దాదాపు సీపీఎస్ సర్వే చెప్పిందే చెప్పింది. వీడీపీ అసోసియేట్స్ సర్వే కూడా వైఎస్‌ఆర్‌సీపీ గెలువబోతున్నదని చెప్పింది. మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో మొత్తానికి మొత్తం ప్రభుత్వ వ్యతిరేక అభ్యర్థులే గెలిచారు. ఎన్నికల పండితుల విశ్లేషణలు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉన్నాయి. చంద్రబాబు తన మీడియా ద్వారా కూడా తనకు అనుకూల ప్రచారం కంటే జగన్ వ్యతిరేక ప్రచారమే ఎక్కువగా చేయించారు. అయినా చంద్రబాబును తీసేయడానికి లేదు. గత కొద్ది రోజులుగా ఆయన పంపిణీ చేస్తున్న వివిధ పథకాల సొమ్ము ప్రజలకు చేరుతున్నది. డ్వాక్రా గ్రూపులు కృతజ్ఞతాభావంతో ఉన్నాయి. చంద్రబాబు పోల్ మేనేజ్‌మెంట్‌లో మొనగాడు. జగన్ వాళ్లు ఇప్పటికే అతి ఆత్మవిశ్వాసంలో పడిపోయారు. పోయినసారి జరిగినట్టే ఈసారీ జరిగే అవకాశం ఉంది అని ఆ పరిశీలకుడు అభిప్రాయపడ్డారు.

అయినా చంద్రబాబుకు మాత్రం నమ్మకం లేదు. ఓటమి భయం ఆయనతో తప్పుల మీద తప్పులు చేయిస్తున్నది. ఎందుకంటే ఈసారి ఆయనకు నమ్మకమై న మిత్రులు లేరు. ఆయన రాజకీయ జీవితంలో ఇది మొదటి ఒంటరి పోరు. ఎప్పుడూ ఏదో ఒక పార్టీ మద్దతుతో ఎన్నికల్లో దిగేవారు. ఈసారి కూడా పవన్ కల్యాణ్‌ను, కేఏ పాల్ వంటి వారిని పరోక్షంగా ఆపరేట్ చేసినా ఆయనకు జరిగిన మేలేమీ లేదు. ఎందుకంటే పోయినసారి పవన్‌కల్యాణ్ చంద్రబాబుతోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన విడిగా పోటీ చేయడం వల్ల చీలేది గతంలో చంద్రబాబుకు పడిన ఓటే. గత ఎన్నికల నాటి మిత్రపక్షం బీజేపీ విడిగా పోటీ చేస్తున్నది. చాలా సామాజికవర్గాలు చంద్రబాబుకు దూరమయ్యాయి. ఎటుచూసినా చంద్రబాబు పరాజయ సోపానంలోనే ఉన్నారు. అందుకే ఆయన సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారు. జగన్ ప్రచారం కూడా గొప్పగా ఏమీ లేదు. ఒక్కోసారి మరీ బిక్షం అడుక్కుంటున్నట్టు, మరోసారి సువార్త ప్రవచనాలు విన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే, తాను చేయదల్చుకున్న అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడి ఆయన ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతున్నది. అవినీతి అన్నది ఆంధ్ర ఎన్నికల ప్రచారాంశం కాదిప్పుడు. ఇద్దరిలో ఎవరూ తక్కువ కాదన్నది జనాంతికంగా వినిపించే మాట. ఇక తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షమే. పదహారు స్థానాల్లోనూ ఒకే నినాదం. చలో ఢిల్లీ. రాష్ట్రానికి అత్యధిక ప్రయోజనం సాధించగలిగిన రీతిలో సొంత పార్టీని గెలిపించుకోవాలన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు నినాదానికి సర్వత్రా ప్రజామోదం కనిపిస్తున్నది.

పోటీలో కాంగ్రెస్, బీజేపీలున్నా అది నామమాత్రమే. ఆ రెండు పార్టీలు అరవయ్యేండ్ల పాలనలో దేశానికి కావాల్సిన అభివృద్ధి నమూనాను అందించలేకపోయాయి. అభివృద్ధిని ప్రజల మార్గం పట్టించిన తొలి నాయకునిగా కేసీఆర్, ఇవ్వాళ అన్ని పార్టీలకు, అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇవ్వాళ జాతీయపార్టీల ఎజెండాలుగా మారాయి. అయినా, జాతీయపార్టీలు ఈ విధానాలను ఎన్నికల అవసరాలుగా పరిగణిస్తున్నాయే తప్ప ఒక నిబద్ధతగా భావించడం లేదు. అటు బీజేపీకి గానీ, ఇటు కాంగ్రెస్‌కు గానీ ఒక సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కలిగిన నాయకులూ లేరు. అందరూ ప్రాంప్టింగ్ మీద ఆధారపడినవారే. అదీగాక జాతీయ పార్టీలకు అనేక పరిమితులు ఉంటాయి. రకరకాల గుంజాటనలుంటాయి. మన రాష్ట్రానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించే సొంతపార్టీకి అటువంటి పరిమితులు ఉండవు. రాష్ట్రాల అభివృద్ధి నమూనాలను స్వేచ్ఛగా జాతీయస్థాయిలో అమలుచేయడానికి ప్రాంతీయ పార్టీలకు ఉండే ధైర్యం, అనుభవం జాతీయపార్టీలకు ఉండదు. ఒకవైపు దేశ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తూనే రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్ల సాధనలో టీఆర్‌ఎస్ నాయకులు పట్టుబట్టినంతగా జాతీయపార్టీల నాయకులెవరూ పట్టుబట్టరు. తెలంగాణ రాష్ట్రసాధన సందర్భంగా ఎదురైన అనుభవమే మనకు రుజువు. అప్పట్లో మన ఇద్దరు ఎంపీలు కొట్లాడినట్టుగా కాంగ్రెస్ ఎంపీలు కూడా తెగబడి కొట్లాడి ఉంటే తెలంగాణ ఇంకా ఏడెనిమిదేండ్లు ముందుగా వచ్చి ఉండేది. ఇప్పుడు కూడా మన పదహారు మంది ఎంపీలు మనకు ఉంటేనే ఢిల్లీ నుంచి ఏదైనా సాధించుకోగలం.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *