mt_logo

బాల్యవివాహాలను నిర్మూలించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ : మంత్రి కేటీఆర్

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంశలు కురిపించారు. పేద కుటుంబాలు కూతురు పెళ్లి చేసి అప్పులపాలు కావొద్దు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అటు పేద కుటుంబాలకు, ఇటు బాలికలకు ఎంతో గొప్ప మేలు చేశాయని కొనియాడారు. సామాన్య కుటుంబాలను అప్పుల బారి నుండి కాపాడటమే కాకుండా… ఎంతో మంది బాలికలను బాల్యవివాహాల నుండి రక్షించాయని పేర్కొన్నారు. ఈ రెండు పథకాల కింద 10 లక్షల మంది అమ్మాయిల వివాహాలకు 9,072 కోట్ల రూపాయలు ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *