mt_logo

లండన్ లో DR. B. R. అంబేద్కర్ మరియు జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

తెలంగాణా ఎన్ఆర్ఐ(TeNF) ఫోరం ఆధ్వర్యంలో DR. B.R. అంబేద్కర్ మరియు జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మరియు జనరల్ బాడీ మీటింగ్ 2015-2016 జరుపుకున్నారు. UK నలుమూలల నుండి తెలంగాణా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా అమరవీరులకు, DR. B.R.అంబేద్కర్ మరియు జ్యోతిరావు ఫూలేలకు నివాళులర్పించి తదనంతరం తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ఎన్నుకోబడ్డ “జయ జయహే తెలంగాణ” తో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా వక్తలు జ్యోతిబా గోవిందరావ్ ఫూలే, అంబేద్కర్ త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భారత ప్రప్రథమ సామాజికతత్వవేత్త తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకు గురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కులకోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషిచేసిన మహనీయులు అని కొనియాడారు.

2015-16 కు గానూ కార్యవర్గ సమావేశంలో తెలంగాణా పునర్నిర్మాణంలో TeNF పాత్ర ఎలా ఉండాలి మరియు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే దానిపై సమావేశంలో చర్చించారు.

గడచిన సంవత్సరంలో చేసిన స్వచ్ఛంద కార్యక్రమాలు మరియు రాబోయే రోజుల్లో సంస్థ తెలంగాణ పునర్నిర్మాణంలో మరియు స్వచ్ఛంద కార్యక్రమాలు రెట్టింపు ఉత్సాహంతో చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలంగాణ ఎన్నారై ఫోరం అద్యక్షులు సిక్కా చందు గౌడ్ ఈ సందర్భంగా చెప్పారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం అద్యక్షులు సిక్కా చందు గౌడ్ మరియు ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు అర్చన జువాడి వ్యవస్థాపక సభ్యులు అనిల్ కూర్మాచలంతో పాటు ప్రధాన ఉపాధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది, కార్యదర్శి సుమన్ బాల్మురి, సంయుక్త కార్యదర్శిలు ప్రవీణ్ రెడ్డి, ఈవెంట్స్ ఇంచార్జ్ ప్రమోద్ గౌడ్ అంతటి, ఈవెంట్స్ సెక్రటరీ నగేష్ రెడ్డి, కల్చరల్ సెక్రటరీ మీనాక్షి, అడ్వైజరి బోర్డు సభ్యుడు ఉదయ నాగరాజు, సుధాకర్ గౌడ్ రంగుల, మహిళా విభాగం సభ్యులు స్వాతి బుడగం, వాణి అనసూరి, క్రీడాశాఖ ఇంచార్జ్ నరేష్, నవీన్ రెడ్డి, చిట్టి వంశీ, ఇతర కమిటీ సభ్యులు, అశోక్ గౌడ్, మల్లారెడ్డి, సత్యం కంది, శ్రీకాంత్ జెల్ల, విక్రం రెడ్డి, రంగు వెంకట్, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *