ముందస్తు అభ్యర్థులను ప్రకటించడంతో, వలసల జోరు కొత్త జోష్ నింపుతున్నది టీఆర్ఎస్ లో. అనైతిక పొత్తులపై ఆగ్రహంతో కొందరు, తెలంగాణ ప్రగతి రథచక్రం ఆగకూడదని మరికొందరు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే.ఆర్. సురేష్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన బండారి లక్ష్మారెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు.
మేడ్చల్ జిల్లాకు చెందిన మరో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, వికారాబాద్ జిల్లాకు చెందిన మరో ముఖ్య నాయకుడు కూడా భారీ సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. ఒంటరిగా గెలిచే సత్తా తమ దగ్గర లేదనే అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్… టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలతో పొట్టు పెట్టుకోవాలని యోచిస్తున్నది. ఈ విషయంపై చర్చలు కూడా జరిగాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకముగా ఆవిర్భవించిన టీడీపీ తో పొత్తు అనైతికంగా భావించిన పలువురు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై అధిష్టానంపై కూడా తీవ్ర ఆగ్రహంతో వున్న కొంత మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ లో చేరడానికి నిశ్చయించుకున్నారు.