మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలకు తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కు చేదు అనుభవం ఎదురైంది.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జైకేసారంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం నిర్వహించేందుకు రాగా… గ్రామస్థులు, తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ను విమర్శిస్తూ… అబద్దాలు ప్రచారం చేస్తుండటంతో బూర నర్సయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ… తక్షణమే గ్రామం వదిలి వెళ్లాలని హెచ్చరించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో చేసేదేం లేక బూర నర్సయ్య ప్రచారం వదిలి అక్కడినుండి వెనుదిరిగారు.
