తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అనుసరించే వ్యూహాలపై శుక్రవారం ఉదయం సీఎల్పీ భేటీ అయింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై పార్టీ ముఖ్య నేతల దగ్గర తన అసంతృప్తిని, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పార్టీ వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం.. సంగారెడ్డికి వస్తున్నట్టు పీసీసీ నుంచి కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. తన నియోజకవర్గానికి వస్తున్నపుడు సమాచారం ఇవ్వాలనే ప్రోటోకాల్ కూడా తెలియదా అని ప్రశ్నించారు. కావాలనే గజ్వేల్ సభలో తనను మాట్లాడనివ్వలేదన్నారు. తనకు రేవంత్ కి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేందుకే రేవంత్ రెడ్డి ఇలా ప్రవర్తిస్తున్నారని అని జగ్గారెడ్డి పార్టీ ముఖ్యనేతల దగ్గర వాపోయారు. పార్టీ కమిటీలలో డిస్కషన్ చేయకుండా ముందే ప్రోగ్రాంలు ఫిక్స్ చేస్తున్నారు, ఇది పార్టీనా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అందరూ ఒకటేనని, ఒక్కరే స్టార్ అనుకుంటే కుదరదని, ఒక్కడి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాగా సమావేశం ముందు నుంచే జగ్గారెడ్డి ఆగ్రహంతో ఉన్నారని తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఆఖరి నిమిషంలో సీఎల్పీ భేటీకి దూరంగా ఉన్నారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్