mt_logo

గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు..

ఫొటో ఓటర్ స్లిప్‌లను గుర్తింపుకార్డులుగా పరిగణించడం లేదని, ఈసీఐ ఆదేశాల మేరకు ఎపిక్ (ఓటరు గుర్తింపు) కార్డు లేదా మరో 11 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని ఓటర్లకు సీఈవో సూచించారు. 1) పాస్‌పోర్ట్, 2) డ్రైవింగ్ లైసెన్స్, 3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ ప్రభుత్వరంగ సంస్థలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీచేసిన ఉద్యోగుల ఫొటో గుర్తింపుకార్డు, 4) బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోతోసహా జారీచేసిన పాస్ పుస్తకాలు, 5) పాన్‌కార్డు, 6) ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీచేసిన స్మార్ట్ కార్డు, 7) నరేగా జారీచేసిన ఉపాధిహామీ పత్రం, 8) ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ జారీచేసిన స్మార్ట్ కార్డ్, 9) ఫొటోజత చేసి ఉన్న పింఛన్ పత్రాలు, 10) ఎంపీ/ ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు పత్రం, 11) ఆధార్ కార్డు.. వీటిల్లో ఏదో ఒక గుర్తింపుకార్డు చూపించినవారిని మాత్రమే ఓటు వేయనిస్తారని తెలిపారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *