mt_logo

ఐఏఎంసీ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, సీజే ఎన్వీ రమణ

దేశంలోనే తొలి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) తెలంగాణాలో ఏర్పాటైంది. హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడ‌ వద్దగల ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌లో ఏర్పాటు చేసిన‌ ఐఏఎంసీ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ క‌లిసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్‌సైట్ ఆవిష్క‌రించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌ను అతిగా ప్రేమించే వ్య‌క్తుల్లో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఒక‌రని, ఐఏఎంసీ ఏర్పాటుకు ప్ర‌ధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు. హైదరాబాద్ అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు దీటుగా పురోగ‌మిస్తోందని, అనేక రంగాల్లో హైద‌రాబాద్ కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోందని స్పష్టం చేశారు. న్యాయ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన‌టువంటి ప్ర‌క్రియ‌లో అనేక కార‌ణాల చేత కోర్టుల‌లో ప‌రిష్కారం కానీ కేసులు, ఆర్బిట్రేషన్ సెంట‌ర్ల‌లో ప‌రిష్కారాలు ల‌భ్య‌మ‌వుతుండ‌టం అనేది ఈరోజు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫ్యాష‌న్. అట్లాంటి సౌక‌ర్యం భార‌త‌దేశంలో ప్ర‌ప్ర‌థ‌మంగా హైద‌రాబాద్‌లో రావ‌డం, ర‌మ‌ణ మ‌న‌ల్ని దీవించ‌డం మ‌నంద‌రికి గ‌ర్వ‌కార‌ణం అన్నారు. కంపెనీలు, పెట్టుబ‌డిదారుల మ‌ధ్య వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌డం ఈ సెంట‌ర్ ల‌క్ష్యం. రాష్ట్ర వివాదాలు ఆర్బిట్రేష‌న్ ద్వారా ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఆర్డినెన్స్ ద్వారా చ‌ట్టాలు తీసుకొస్తామ‌న్నారు. మంచి ఉత్త‌మ‌మైన సెంట‌ర్‌ను ఇక్క‌డ తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్ర‌తి ఒక్క‌రికి హృద‌య‌పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *