దేశంలో కొవిడ్ పరిస్థితులు సద్దుమణగడంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పుంజుకొంటున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో నియామకాలు 6% పెరిగినట్టు మాన్స్టర్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ (ఎంఈఐ) స్పష్టం చేసింది. ఐటీ, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రంగాలకు సంబంధించిన ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ 39% వృద్ధిరేటుతో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకొన్నది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్ కూడా 39% వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (35 శాతం), బెంగళూరు (31 శాతం), ముంబై (29 శాతం) ఉన్నాయి. దేశంలోని 11 మహా నగరాల్లో రెండంకెల వృద్ధి నమోదయిందని, మిగిలిన 2 మెట్రో నగరాల్లో మాత్రం నియామకాలు గతంలో కంటే తగ్గాయని విడుదల చేసిన వార్షిక నివేదికలో ప్రకటించింది. అన్ని రంగాల్లో కలుపుకొని 16% వృద్ధిరేటుతో హైదరాబాద్ దేశంలోనే తృతీయ స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ఐటీ రంగాల్లో నియామకాలు క్రమంగా పెరుగుతున్నట్టు పేర్కొన్నది. ఇంజినీరింగ్, సిమెంట్, నిర్మాణ, ఇనుము/ఉక్కు తదితర రంగాల్లో ఉద్యోగ నియామకాలు దాదాపు 20% తగ్గినట్టు తెలిపింది. ప్రస్తుతం పలు కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోం’ విధానానికి స్వస్తి పలికి ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ విధానాన్ని ప్రారంభిస్తుండటంతో మున్ముందు ఉద్యోగ నియామకాలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేసింది.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!