mt_logo

ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీల అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష

వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబందించిన మున్సిపాలిటీల అభివృద్ధి గురించి హ‌నుమకొండ జిల్లా అభివృద్ధిపై క‌లెక్ట‌రేట్‌లో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప‌ట్ట‌ణాల్లో ఇండ్ల నిర్మాణాల‌కు టీఎస్ బీపాస్ ద్వారా మాత్ర‌మే నిర్మాణాల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కేటీఆర్ సూచించారు. ప్ర‌తి మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లతో పాటు వైకుంఠ‌ధామం నిర్మించాల‌ని ఆదేశించారు. గ్రీన్ బ‌డ్జెట్‌ను సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఆధునిక దోబీ ఘాట్లు నిర్మాణం కావాల‌న్నారు. బ‌యో మైనింగ్ ద్వారా డంప్ యార్డులో చెత్త నిర్వీర్యం చేయాల‌ని సూచించారు. ప్ర‌తి మున్సిపాలిటీలో మాన‌వ వ్య‌ర్థాల శుద్దీక‌ర‌ణ ప్లాంట్ నిర్మించాల‌న్నారు. పేద‌ల‌కు రూపాయి న‌ల్లా క‌నెక్ష‌న్ ఇవ్వాలి. అన్ని ప‌ట్ట‌ణాల్లో మాస్ట‌ర్ ప్లాన్ పూర్తి కావాల‌ని ఆదేశించారు. డిజిట‌ల్ డోర్ నంబ‌రింగ్ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *