mt_logo

సిరిసిల్ల పట్టుచీరలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ : మంత్రి కేటీఆర్

సిరిసిల్ల పట్టు చీరెలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉందని అన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, టెక్స్‌టైల్‌ శాఖల మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం బతుకమ్మ చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్… త్వరలోనే సిరిసిల్లలో అపెరల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నేతన్నలకు ఆర్థిక స్వాలంబన కల్పిస్తూ, తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకలు ఇవ్వడానికి చీరెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఏటా చీరెల పంపిణీకి ప్రభుత్వం రూ.300కోట్లు ఖర్చు చేస్తోందని తెలియజేసారు.

నేతన్నలకు రూ.5లక్షల బీమా పథకం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికులకు 40 శాతం, పవర్లూమ్ కార్మికులకు 10 శాతం నూలు రాయితీ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. 60 ఎకరాల్లో ఏర్పాటు చేసే పార్క్‌లో బీడీలు చుట్టే మహిళలకు పనులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తమిళనాడు తిరుప్పూర్‌కు వెళ్లి అక్కడి వస్త్ర పరిశ్రమను పరిశీలించి రావాలని పవర్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెక్రెటరీ బుద్ధ ప్రకాశ్‌కు మంత్రి సూచించారు. చేతనైన స్థాయిలో మంచి బతుకమ్మ చీరెలను ఉత్పత్తి చేస్తున్నామన్న కేటీఆర్‌.. నేతన్నల అభివృద్ధికి అన్ని రకాల కార్యక్రమాలు చేపడతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *