తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21 న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ‘తెలంగాణకు హరితహారం’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి అరణ్య భవన్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్నివర్గాల ప్రజలు హరితహారంలో పాల్గొని మొక్కలునాటి.. విజయవంతం చేయాలని కోరారు.