మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాష, నేరపూరిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.
లేఖలోని ముఖ్యాంశాలు 👇
కాంగ్రెస్ పార్టీ తామే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద ప్రమాణాలకు నిదర్శనం. రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ గారిపై దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం అతని దిగజారుడుతనానికి నిదర్శనం.
రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని మొసలి కన్నీరు కార్చింది.
అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హైకమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ డబల్ స్టాండర్డ్స్ కాదా?
ఢిల్లీలో ఒక రూల్ గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్‌కే చెల్లుతుంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధం.. కాంగ్రెస్ హైకమాండ్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
రేవంత్ రెడ్డి ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా ఉంది. కాంగ్రెస్ తన నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయం
కేసీఆర్ గారిపై, ఆయన కుటుంబంపై రేవంత్ రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడం కాదా.. కేసీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపాలి అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సమర్ధిస్తుందా?
హింసాత్మక వ్యాఖ్యలు చేయడం, జర్నలిస్టులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు
పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులపై నిరాధార కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడడం దుర్మార్గం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది అని చెప్పేందుకు ఇది నిదర్శనం
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మహాభారతంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి దుర్మార్గాలను ఉపేక్షించడం లాంటిదే. రేవంత్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
- 1.5 lakh houses in danger for Rs. 1.5 lakh cr Musi Beautification Project
- Office space absorption in Hyderabad plummets under Congress rule
- Congress and BJP’s ‘Ajab Prem ki Ghazab Kahani’ in Telangana
- 1.5 lakh houses to be demolished for Rs. 1.5 lakh cr Musi beautification project?
- Revanth govt. planning to use unfinished private building for govt. office?
- రేవంత్ రెడ్డి ఓ సైకో సీఎంలా తయారయ్యాడు: కౌశిక్ రెడ్డి
- రుణమాఫీపై దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా: హరీష్ రావు
- దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలి: కేటీఆర్
- టాలీవుడ్ అంతు చూస్తామంటూ రేవంత్ సైన్యం రౌడీయిజం!
- కొండా సురేఖకు, రేవంత్ కాంగ్రెస్‌కు గడ్డి పెట్టిన టాలీవుడ్!
- పేదల ఇల్లు కూలగొట్టుడు, భూములు కొల్లగొట్టుడు.. ఇదేనా ఇందిరమ్మ పాలన: హరీష్ రావు
- మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉంటాం.. కేటీఆర్ భరోసా
- ఢిల్లీలో ఉన్న గాంధీలు కాంగ్రెస్ అమానవీయ పాలనపై స్పందించాలి: కేటీఆర్
- తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ: కేసీఆర్
- భయపెట్టి పాలన చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు: జగదీశ్ రెడ్డి