mt_logo

బీఆర్ఎస్ నాయకుల హౌజ్ అరెస్టులను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ సహా బీఆర్ఎస్ నాయకుల హౌజ్ అరెస్టులను తీవ్రంగా మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు.

మంత్రులు వచ్చి నర్సంపేట మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ప్రారంభిస్తున్నారన్న కారణంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌజ్ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలిపారు.

మెడికల్ కాలేజీ మంజూరు చేసి జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, ఆ ఘనతను తమ ఖతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుటిలయత్నానికి పాల్పడుతున్నది అని దుయ్యబట్టారు.

ప్రజా పాలన అంటూ ప్రతిపక్ష నాయకులను అరెస్టులు, అష్టదిగ్బంధనాలు చేయడం అప్రజాస్వామికమైన చర్య అని అన్నారు. హౌజ్ అరెస్ట్ చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి సహా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.