mt_logo

డిసెంబర్ 9 నాడే రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలి: హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ ప్రకటనపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు అని విమర్శించారు.

డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలి. రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటానికి భయపడే రేవంత్ ఈ ప్రకటన చేశారు ఆని పేర్కొన్నారు.

ఎకరానికి రూ. 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఇవ్వలేదు? వ్యవసాయ కూలీలకు రూ. 12,000 ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదు? మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమయింది? రూ. 4 వేలకు పెంచుతామన్న పెన్షన్‌ను ఎప్పుడు పెంచి ఇస్తారు? అని హరీష్ ప్రశ్నించారు.

ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓడిపోతామని భయంతోనే మళ్లీ కొత్తగా హామీలు ఇస్తున్నారు అని దుయ్యబట్టారు.