మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజా పాలనలో పెన్నులు గన్నులు అయ్యాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ఉండేనా.. అన్ని ఫ్లోర్‌లు స్వేచ్చగా తిరిగేవారు జర్నలిస్ట్‌లు. సచివాలయంలో విలేకరులకు స్వేచ్ఛ ఎందుకు లేదు అని ప్రశ్నించారు.
నిధులు దుర్వినియోగం అని చెప్పిన వారు ఆరుగురు పీఆర్వోలను ఎందుకు పెట్టుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను చూసి ఓటు వేయండి.. మా 100 రోజుల పాలన చూసి ఓటు వేయండి అన్నారు. ఏం ఉంది ఆయన 100 రోజుల పాలన అని విమర్శించారు
వైట్ పేపర్ .. ఆ ఆపేర్ అంటూ కాషాయ పేపర్ మీద ఆయన లవ్ లెటర్ రాశాడు. వాస్తవానికి ప్రజలనే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేశాడు రేవంత్ రెడ్డి.. గుజరాత్ మోడల్ ఫెయిల్ అని మళ్ళీ ఆయనే గుజరాత్ మోడల్ కావాలని అన్నాడు.అధికారంలోకి మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తాడు అని నిన్న రేవంత్ అన్నాడు.. 10 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది.. అలాంటప్పుడు మోడీని ఎందుకు అంత పొగడడం. అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని చెప్పకనే చెప్పారు రేవంత్ గారు అని హరీష్ రావు పేర్కొన్నారు.
3 నెలల పాలనలో ప్రజలను, ఇటు కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్నాడు. 100 రోజుల పాలన చూసి ఓటు వేయండి అన్నాడు మీరు మరి ఇప్పుడు ఎం చేశారని మీకు ఓటు వేయాలి.మీరు డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు.. కానీ ఇప్పుడు ఏమైంది. ఇప్పటివరకు కూడా రుణమాఫీ లేదు. కనీసం మొన్న బడ్జెట్‌లో కూడా రైతు రుణమాఫీకి నిధుల కేటాయింపులు లేవు అని గుర్తు చేశారు.
మొన్న ఇంకొక మాట.. రైతులకు క్వింటాల్‌కు 500 ఇస్తామని చెప్పారు. మొన్న పంట కొనుగోలులో కూడా ఇలానే చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు బోనస్. ఇప్పుడైనా వచ్చే యాసంగి పంటకు 500 బోనస్ ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరువు వచ్చింది. కొత్త కొత్త బోరు బండ్లు వచ్చాయి. ట్యాంకర్ల ద్వారా వరి పంటకు నీళ్లు పోస్తున్నారు అని అన్నారు.
పెన్షన్ 4 వేలు ఇస్తాం అన్నారు.. ఏమైంది? కనీసం ఉన్న రెండు వేలు కూడా నేల నెల పడడం లేదు. ఒక్క నెల ఎగ్గొట్టారు.. బాండ్ పేపర్ రాసిచ్చినారు.. బాండ్ పేపర్ రాసి ఇచ్చిన వారిపై కేస్ పెట్టాలి అని తెలిపారు.
6 గ్యారెంటీలల్లో 13 హామీలు ఉన్నాయి.. అవన్నీ అమలు చేయాలి అప్పుడే మీరు ఓటు వేయాలి.. మహిళలను మహాలక్ష్మీలను చేస్తాం అన్నారు.. ఏమైంది. అడబిడ్డలు ఆలోచన చేయాలి అని హరీష్ రావు అన్నారు.
ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా ఇస్తాం అన్నారు.. ఏమైంది? ఇప్పుడు రక్తం పిండి వసూలు చేస్తున్నారు. నాడు మేము అధికారంలోకి వస్తే ఉచితంగా అన్నారు.. నిరుద్యోగులకు ₹4,000 ఇస్తాం అన్నారు.. ఏమైంది? అసెంబ్లీలో ఆ ఊసే ఎత్తలేదు.. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి ఓటు అని ప్రశ్నించారు.
ఆటో అన్నలకు ₹ 12,000 అన్నారు.. ఏమైంది? ఆటో అన్నలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆటో అన్నలు ఆలోచన చేయాలి.. అప్పుల గురించి మాట్లాడారు ఆనాడు… ఇవాళ 16 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంకా అప్పుకోసం ఢిల్లీలో ప్రయత్నం చేస్తున్నారు.. బాండ్ పేపర్ రాసిచ్చిన డిప్యూటీ సీఎం భట్టి గారు అసెంబ్లీని సైతం తప్పుదోవ పట్టించారు అని దుయ్యబట్టారు.
ఒక్క బిల్డింగ్ లో 3 ఫ్లోర్లు ఉంటే అన్నదమ్ములు ఒక్కో ఫ్లోర్లో ఒక్కరు ఉంటే రేషన్ కార్డు మొత్తం ఒక్క కుటుంబంకు మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు మూడు మీటర్లకి ఉచిత విద్యుత్ కింద గృహలక్ష్మీ పథకం అమలు కాదు.. మరి ఎందుకు వేయాలి ఓటు అని ప్రశ్నించారు.
ఉపాధి హామీ పథకం పని చేసే 3000 మందికి ఇప్పటివరకు జీతాలు రాలేదు.. ఎన్‌హెచ్ఎంలో రెండు నెలల నుండి జీతాలు రాలేదు. వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టారు.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు లేవు. విదేశీ విద్యకు ఇప్పటివరకు పైసలు ఇవ్వడం లేదు.. సీఎంఆర్ఎఫ్ దాదాపు 70 వేల మందికి పెండింగ్‌లో పెట్టారు.. వైద్యం ఖర్చులకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ఇవన్నీ చూసి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యలా అని హరీష్ రావు ఘాటుగా విమర్శించారు.
నాడు పోలవరం ప్రాజెక్టు వాల్ కొట్టుకుపోయింది. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది.. ఇప్పటివరకు రిపోర్ట్ లేదు. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్‌డీఎస్ఏ వచ్చింది. ఆ రిపోర్ట్ 4 నెలలో వస్తుంది అంటున్నారు. అప్పటివరకు ఎందుకు సమయం పడుతుంది.. వచ్చే వానాకాలంలో నీళ్లు ఇవ్వరా… వర్షకాలంలో ఫ్లడ్ వస్తే పంప్‌హౌస్ మునిగిపోతే మేము ప్రభుత్వంకు భారం పడకుండా త్వరితగతిన పూర్తి చేసి నీళ్లు లిఫ్ట్ చేశాము అని గుర్తు చేశారు.
తుమ్మిడిహట్టి దగ్గర ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ల్యాండ్ ఆక్విజేషన్ చేసి ప్రాజెక్టు నిర్మాణం చేయవచ్చు. తుమ్మిడిహట్టిపై ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడారు అని అన్నారు.
అసెంబ్లీకి ప్రతిపక్ష నేత ఎందుకు రాలేదు అంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆ విషయం రేవంత్ కూడా తెలుసు.. ఒక్క రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు.
- Rs. 4,500 cr debt in September: Revanth pushing Telangana into debt trap
- Revanth’s plan to utilize ‘Pharma City’ lands for his ‘Future city’ foiled
- Inordinate delay: Congress struggling to expand Telangana cabinet
- All time record: Revanth govt. makes Rs. 10,392 cr debt in July
- Defected BRS MLAs face uncertain future following High Court ruling
- రేవంత్ సీఎం అయింది పేదవాళ్ల ఇళ్లు కూలగొట్టడానికా?: కేటీఆర్
- హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌లో భయం మొదలైంది: కేటీఆర్
- ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు బ్రేకులు పడటం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనం: కేటీఆర్
- నిన్న జరిగిన దాడికి కర్త, కర్మ, క్రియ రేవంత్ రెడ్డి: హరీష్ రావు
- బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు?: కేటీఆర్
- లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని డీజీపీ హామీ మేరకు సహకరిస్తున్నాం: హరీష్ రావు
- కౌశిక్ రెడ్డిపై దాడికి ఉసిగొలిపిన సీఐ, ఏసీపీని సస్పెండ్ చేయాలి: హరీష్ రావు
- సీతారాం ఏచూరి కృషి కారణంగా లక్షల కార్మికుల జీవితాలు బాగుపడ్డాయి: కేటీఆర్
- పట్టపగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. ఇదేనా కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ?: హరీష్ రావు
- సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకికవాదానికి తీరని లోటు: కేసీఆర్