mt_logo

మోడీ మత విద్వేషాలు రెచ్చగొడితే… రేవంత్ బూతులు మాట్లాడితే ఆపరా: హరీష్ రావు

మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా సిద్ధిపేట జిల్లా, చిన్న కోడూరులో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ను రెండు రోజులు ప్రచారం చేయవద్దు ఆగాలి అన్నారట.. వాళ్ళ మీద గట్టిగ కొట్లడుతున్నారని కేసీఆర్‌ను ఆపారు.. మోడీ మత విద్వేషాలు రెచ్చగొడితే ఆపరు.. రేవంత్ భూతులు మాట్లాడితే ఆపరు.. ఎన్నికల కమీషన్‌కు ఇవి కనిపించవా.. కానీ కేసీఆర్ ప్రశ్నిస్తే ఆపుతున్నారు.. ప్రచారం చేయద్దు అంటున్నారు అని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ను అపినంత మాత్రాన ఏమవుతుంది.. రెండు రోజులు ఆపితే ఏం జరుగుతుంది.. కేసీఆర్ ప్రజల గుండె గుండెలో ఉంటాడు. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తానంటే గజ గజ వణుకుతున్నారు. కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తిని చెడ్డీ ఊడకొడతా అని మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి స్థాయి దిగజారి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు అని విమర్శించారు.

కేసీఆర్‌ను అంటే మనందరిని అన్నట్టు కాదా.. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా జిల్లాలు అయ్యేవా.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి.. కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డిని గెలిపించాలి అని హరీష్ పిలుపునిచ్చారు.

కలెక్టర్ ఎంపీగా వచ్చారు.. దీవించాలని మనవి చేస్తున్నాను. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి.. కాంగ్రెస్ వాళ్లకు సురుకు తగలాలి అని అన్నారు.