mt_logo

హమారా హైదరాబాద్

శాంతి కాముకులం సర్వమత ప్రేమికులం

శాంతి సామరస్యాలకు నెలవైన నేల ఇది..అన్ని మతాలను ప్రేమించే మంచి ‘మనసులున్న’ ప్రాంతం ఇది.. భాగ్యనగర చరిత్ర చెప్పే చారిత్రక సత్యం కూడా అదే.. పరమత సహనంలో యావత్ భారతావనికే హైదరాబాదీలు ఆదర్శంగా నిలుస్తారు. ఈ విషయం చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. ఈ సంస్కృతి కలకాలం వర్ధిల్లాలని జాతిపిత మహాత్మాగాంధీ ఆకాంక్షించారు. ఇంతటి మహోన్నత సంస్కృతికి వారసులం మనం. దీనిని నిలుపుకునేందుకు కృషి చేద్దాం. మనవంతు బాధ్యతగా ముందు నడుద్దాం. చిచ్చు పెట్టాలని చూసే అల్లరిమూకల ఆగడాలను ఐక్యత అనే బలంతో అరికడదాం.. ఇది మన హైదరాబాద్..మనందరి హైదరాబాద్…గంగాజమునా తెహ్రీ జిందాబాద్…

మూసీనది ఒడ్డున వెలిసిన పరమత సహనం హైదరాబాద్. శాంతి సామరస్యాలకు నెలవుగా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న సహజీవన సౌందర్యం హైదరాబాద్. హిందూ, ముస్లిం సంస్కృతుల సమ్మేళనంతో రూపొందిన దెక్కన్ సంస్కృతిక పరిమళం మన హైదరాబాద్. భాషలో, భావనలో వైవిధ్యభరితమైన సహజీవన మాలిక హైదరాబాద్. స్వచ్ఛమైన నీళ్లతో నిండిన పవివూతమైన గంగా యమున నదుల్లా ప్రవహిస్తున్న హిందూ ముస్లిం సంప్రదాయాలతో వర్ధిల్లుతున్న గంగా జమునా సంస్కృతి హైదరాబాద్. మహాత్ముడే మెచ్చిన సంస్కృతి మనది. తరతరాల చరివూతలో అలయ్ బలయ్ ఆడుకున్న ఆదర్శం మనది. రంజాన్‌కు, బక్రీద్‌కు ముబారక్ చెప్పుకునే సంప్రదాయం మనది. పీరీల పండుగనాడు ఊరేగే ఆదర్శం మనదే. ఈ సహజీవన మాలలో కొత్తగా ఒదిగిన క్రైస్తవం, సిక్కు మందారాలు. రంగురంగుల పూలు కలిసి శోభిల్లే మాలలా వర్ధిల్లే చరిత్ర మనది. యే హమారా హైదరాబాద్..

హిందూ, ముస్లింల ఐక్యతకు ఈ నగరానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఈ నాటివి కావు. గోల్కొండ కోటలో కుతుబ్‌షాహీల కాలం నాటిది. ముస్లిం రాజులయినప్పటికీ నగరంలో హిందూ దేవాలయాల పరిరక్షణలో, హిందువులను గౌరవించడంలో వీరు చూపిన ఆదర్శవంతమైన పాలన సాగించిన మరో రాజవంశమే లేదు.

గోల్కొండ ఘనత

గోల్కొడను పాలించిన కులీకుతుబ్ షాహీ వంశానికి చెందిన మూడవరాజు ఇబ్రహీం కులీ కుతుబ్‌షా వలీ తన సోదరుడు జంషీద్ కులీ కుతుబ్ షా నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. తన జంషీద్ తండ్రిని చంపి, సోదరుడి కళు ్లపీకి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ హఠాత్ పరిణామంతో కులీకుతుబ్ షా విజయనగర సామ్రాజ్యానికి పారిపోయి రామరాయలు వద్ద రాజ్య అతిథిగా ఆశ్రయం పొందాడు. విజయనగరంలో ఉండగా తెలుగు భాషపై అభిమానం పెంచుకున్న ఆయన తను అధికారం చేజిక్కించుకున్నాక తెలుగు భాషను ఆదరించారు. తన కొలువులో అరబ్బీ, పారశీకువులతో పాటుగా ఎందరో తెలుగు కవులకు ఆశ్రయం కల్పించి కళా పోషకుడిగా నిలిచారు. ప్రసిద్ధి చెందిన ప్రాచీన తెలంగాణ కవులలో ప్రముఖులయిన సింగరాచార్యుడు, అద్దంకి గంగాధరుడు, కందుకూరి రుద్రకవి తదితరులు ఆయన కొలువులో ఆశ్రయం పొందినవారే. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా భాగీరథి అనే తెలుగు వనితను వివాహం చేసుకున్నారు.

తారామతి ప్రేమ మందిరం

కుతుబ్‌షాహీల కాలంలో గొప్ప నాట్యగత్తెలుగా ప్రసిద్ధి చెందిన తారామతి, ప్రేమావతి హిందూ కుటుంబాలకు చెందినవారే. నాట్యంలో వారి ప్రతిభను గుర్తించి వారికి ఉన్నతమైన సత్కారాలు చేయడమే కాదు. వారికోసం కోటకు సమీపంలోని ఎత్తయిన ప్రదేశాల్లో మండపాలను నిర్మించి వారికి నివాసాన్ని ఏర్పాటు చేశారు. ఆ రెండంతస్థుల భవనాలపై ఉన్న మండపాలపై ఆ అక్కా చెల్లెళ్లిరువురూ నాట్యమాడుతుంటే కుతుబ్‌షాహీ ప్రభువు తన మందిరంలోంచి వీక్షించేవాడు. ముస్లిం రాజులు హిందూ కుటుంబాలకు చెందిన నాట్యగత్తెలను ఈ తీరును ఆదరించిన వైనం చరివూతలో మరెక్కడా కనిపించదు. రాజుల ఆదరణ ఇలా ఉంటే ఆ నాట్య గత్తెలు కూడా ఆ ముస్లిం రాజలపై తమకున్న ఆభిమానం చాటుకోవడమే కాదు. ఆ మతాచారాలను కూడా గౌరవించారు. తారామతి తన మండపానికి సమీపంలో ఓ మసీదును నిర్మించి ముస్లింల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంది.

ఐక్యతకు ప్రతీక

అబ్దుల్ హసన్ కుతుబ్ షా పాలనలో గోల్కొండ కోటలో హిందువులకు ఉన్నతమైన గుర్తింపు లభించింది. ఆయన ఆస్థానంలో ప్రధానులు, సేనాధిపతులు, తహశీల్దారు పదవు లతోపాటు అన్ని రంగాల్లోనూ హిందువులకు అవకాశాలు కల్పించి హసన్ కుతుబ్ షా తనకున్న సర్వమత సమానత్వాన్ని చాటుకున్నారు. చరివూతలో ఓ వెలుగు వెలిగిన హిందూ మస్లింల ఐక్యత, సఖ్యతకు చెరిగిపోని చిహ్నం గోల్కొండ కోట. శత్రు దుర్భేద్యమైన ఈ దర్గమ శిఖరం కాలగతిలో శిథిలమవుతున్నా సర్వమతాల సమతకు, మమతకు మాత్రం అది చెక్కుచెదరని స్ఫూర్తిగానే నిలుస్తోంది. హింసను రగిలించాలని శత్రువుపూంతగా యత్నించినా సహనంతో, సౌభ్రాతృత్వంతో శాంతిని కామిస్తూ, పగలను ద్వేషిస్తూ సాగిపోతున్న ఈ సోదరభావానికి ఆ గోల్కొండ వైభవమే స్ఫూర్తి.

రామదాసు రామ మందిరం

అబుల్ హసన్ తానాషా సంస్థానంలో ఉన్నతోద్యోగులుగా చేరిన హన్మకొండకు చెందిన బ్రాహ్మణులు అక్కన్న మాదన్నల కార్యదక్షత జగద్విఖ్యాతం. ఇక కంచర్ల గోపన్న గురించి తెలియనిదెవరికి. తానీషా కొలువులో కోశాధికారిగా పనిచేసి, భద్రాద్రి రామయ్యకు గుడి కట్టి, జైలుపాలయినా ఆ రామదాసు కథ తెలియని తెలుగువావరుంటారు. చేస్తున్న రామదాసును, డబ్బులు దుర్వినియోగ పరిచిన నేరంపై ఇక్కడే బంధించాడు. అప్పుడే ఆయనిక్కడ రాళ్లపై రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడిని జైలు గోడలపైన చెక్కాడు. ఈ జైలు గోడల మధ్యే ఆయన ‘పలుకే బంగారమాయెనా’, ‘నను బ్రోవమనిచెప్పవే సీతమ్మ తల్లి’ అనే సంకీర్తనలు ఇక్కడే పాడారాయన. రామదాసు ప్రయత్నాలకు, భక్తికి నాటి రాజులు అడ్డు చెప్పలేదు. ఆ గదులను ఆ తర్వాత గుడిగా మార్చి గౌరవించిన మహోన్నతుడు తానీషా. అంతేకాదు భద్రాచలంలోని శ్రీసీతారాముల కల్యాణానికి ప్రతిఏటా గోల్కొండ దర్బారు నుంచి ముత్యాల తలంవూబాలు పంపారు. కుతుబ్‌షాహీలనాటి ఈ సంప్రదాయాన్ని నేటి ప్రభుత్వాలు కూడా ఆచరిస్తున్నాయి.

హిందూ, ముస్లింల నిర్మాణ కౌశలం

మక్కా మసీదు దీనిని సందర్శిస్తే మక్కాలోని మసీదును దర్శించుకున్నంత పుణ్యం వస్తుందని ముస్లింల విశ్వాసం. కుతుబ్‌షాహీల ఆరవ చక్రవర్తి సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా 1617లో మక్కా మసీదు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. దరోగా మీర్ ఫైజుల్లా, చౌదరి రంగయ్య నేతృత్వంలో ఈ నిర్మాణాలు జరిగాయి. సుల్తాన్ మహమ్మద్ ఆదర్శాలు ఆయన కుమారుడు అబ్దుల్లాకూ అలవడ్డాయి. బహుభాషా కోవిదుడయిన ఆయన మంచి సంగీత ప్రియుడు కూడా. హిందువయినా భక్తి సంగీతంలో ప్రసిద్ధుడయిన క్షేత్రయ్యను సభకు ఆహ్వానించి సత్కరించిన ఘనుడాయన. [నమస్తే తెలంగాణ నుండి]

Charminar Photo courtesy: VedicRoutes.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *