mt_logo

చేనేతపై జీఎస్టీ పెంపు అన్యాయం : మంత్రి కేటీఆర్

వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు ప్రతిపాదనను రాష్ట్ర ఐటీ, చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకరించార. ప్రస్తుతం ఉన్న 5 శాతం పన్నును 12 శాతానికి పెంచాలన్న జీఎస్టీ కౌన్సిల్‌ ప్రతిపాదనను విరమించుకోవాలని, చేనేత ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చేనేతపై పన్ను విధించరాదని జీఎస్టీ కౌన్సిల్‌ 2017 మే 18న తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు. ఇప్పటికే కరోనాతో కుదేలైన పరిశ్రమను అదనపు పన్ను భారం తీవ్రంగా దెబ్బతీస్తుందని, మొత్తం పరిశ్రమ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకవేళ పన్ను భారం పెంపు తప్పదని భావిస్తే చేనేత, పవర్‌లూమ్‌ పరిశ్రమపై ప్రస్తుతమున్న 20 లక్షల జీఎస్టీ స్లాబ్‌ను 50 లక్షలకు పెంచాలని కేంద్రమంత్రికి ఆదివారం రాసిన లేఖలో కోరారు. స్లాబు మార్పు వల్ల లక్షలమంది నేత కార్మికులకు ప్రయోజనం కలగడమేకాకుండా ప్రభుత్వానికి పన్ను నష్టం కూడా స్వల్పంగానే ఉంటుందని పేర్కొన్నారు.

నేతన్నలపై అదనపు భారం :

కరోనాతో రెండేండ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ ఏకంగా ఏడు శాతం పెంచడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే వస్త్ర, చేనేత రంగాన్ని ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిందిపోయి అదనపు భారం మోపడం సరికాదని సూచించారు. దేశ చరిత్రలో ఎన్నడూ చేనేత ఉత్పత్తులపై పన్ను లేదని, బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ ద్వారానే తొలిసారి 5 శాతం పన్ను విధించారని, ఇపుడు ఏకంగా మరో ఏడు శాతం పెంచడం దారుణమైన విషయమని పేర్కొన్నారు. తెలంగాణలో చేనేత రంగం అద్భుత ప్రగతి సాధిస్తూ ప్రపంచ ఖ్యాతి పొందుతున్న తరుణంలో జీఎస్టీ పెంపుపై చేనేత కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

పూర్తి మినహాయింపు ఇవ్వాలి :

చేనేత రంగంలో లాభాలు లేకపోవడంతో కొత్తతరం ఈ పరిశ్రమకు దూరమవుతున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2011 లెక్కల ప్రకారం దేశంలో 43.3 లక్షల కుటుంబాలు చేనేత రంగంలో ఉంటే, తాజా లెకల ప్రకారం 30.44 లక్షల కుటుంబాలే మిగిలాయని, 25% కుటుంబాలు పరిశ్రమను వీడి పోయాయని కేటీఆర్‌ తెలిపారు. ఇదే ధోరణి కొనసాగితే దేశంలో కొన్నేండ్లలో చేనేత రంగం అంతర్థానమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘తాజా లెకల ప్రకారం చేనేత రంగంలో సుమారు 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలే ఉన్నారు. వీరిలో 72 శాతం మహిళలే. ఈ బలహీన వర్గాలకు బలమైన ప్రోత్సాహకాలతో అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉన్నది. కేంద్ర ప్రభుత్వ లెకల ప్రకారమే ఈ రంగంలో సుమారు 77 శాతం మంది పాఠశాల విద్యకూడా దాటని వారున్నారు. ఇలాంటి వారికి సంక్లిష్టమైన పన్నుల చెల్లింపు వ్యవహారంపై అవగాహన ఉండదు. దీంతో వారికి మరిన్ని ఇబ్బందులు తప్పవు. దేశంలో చేనేత రంగంలో పనిచేస్తున్న 67 శాతం కుటుంబాల నెలవారీ ఆదాయం 5 వేలకన్నా తకువ. మరో 26 శాతం మంది కుటుంబాల ఆదాయం 10 వేలకన్నా తకువ. మొత్తంగా 93 శాతం చేనేత కుటుంబాల ఆదాయం 10 వేలకు మించడంలేదు. ఈ పరిస్థితుల్లో వారిపై అదనపు పన్ను భారం మోపడం సరైన నిర్ణయం కాదు. చేనేతను ఒక పరిశ్రమగా కాకుండా దేశ సంసృతి, సం ప్రదాయంగా చూడాలి. గాంధీ మహాత్ముని ఆలోచనల దారిలో ఈ రంగానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వాలి’ అని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *