mt_logo

త్వరలోనే గ్రూప్ – 4 నోటిఫికేషన్ : మంత్రి హరీష్ రావు

త్వరలో గ్రూప్4 నోటిఫికేషన్ రాబోతున్నదని అందుకు యువతీయువకులంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాబోయే గ్రూప్ 4 నోటిఫికేషన్ కింద సుమారు 500 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా రాబోతున్నందున అభ్యర్థులందరూ సమయం వృథా చేసుకోకుండా పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. బుధవారం సిద్దిపేట జిల్లా పొన్నాల సమీపంలోని జిల్లా తెలంగాణ భవన్‌లో కెసిఆర్ ఉచిత టెట్ కో చింగ్ సెంటర్ ద్వారా టెట్ కోచింగ్ తీసుకుని అర్హత సాధించిన విద్యార్థులతో మంత్రి ము ఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ… టెట్ ఉచిత కోచింగ్ మాదిరిగా గ్రూప్ 4కు సైతం ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు డీఎస్సీకి సైతం ఇప్పటి నుంచే సంసిద్ధ్దంగా ఉండాలని సూచించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ముందునుంచే లాంగ్ టర్మ్ శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఇక్కడ 618 మంది అభ్యర్థ్ధులకుగాను 517పాస్ అయ్యారన్నారు. కోచింగ్ తీసుకున్నవారు ఉద్యోగాలు సాధించినప్పుడే ఇక్కడ ఇచ్చిన శిక్షణకు సార్ధకత లభిస్తుందన్నారు. సిఎం కెసిఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశారని మంత్రి తెలిపారు. కేంద్రంలో 16.50లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గతేడాదినాటికి ప్రకటించిన లక్షా 50వేల ఉద్యోగాలకుగానూ ఇప్పటికే లక్షా 30 ఉద్యోగాలు ఇచ్చామని, ఇప్పడు మరో 90వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం, యువతను మోసం చేయడానికే తెచ్చారని మంత్రి విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *