తెలంగాణ కెనడా సంగం (Telangana Canada Association – TCA) ఆధ్వర్యంలో 12 సెప్టెంబర్ 2015 శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టొరంటోలోని సెంటెన్నియల్ పార్కలో దాదాపు 300 మంది పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పడుకొన్నారు. సంఘం ఆధ్వర్యంలో ఇది పదకొండవ బతుకమ్మ కాగా తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండవ బతుకమ్మ కావడంతో అందరు కూడా పండుగను అత్యంత సంబురంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ కెనడా సంగం (Telangana Canada Association – TCA) ఆధ్వర్యంలో మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేసారు.
అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారు మాట్లాడుతూ తెలంగాణ కెనడా సంగం (Telangana Canada Association – TCA) ఆధ్వర్యంలో చేయబడే అన్ని కార్యక్రమాలలో ఇంతే ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయవలెనని సబికులందరని కోరారు.
బతుకమ్మలను ప్రక్కనేగల సరస్సులో నిమజ్జనం చేసి సంప్రదాయ బద్దంగా తయారు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నార్.
చివరిగా కమ్మని కాఫీ ఆరగింపు మరియు వందన సమర్పనతో బతుకమ్మ ఉత్సవాలు ముగిసాయి.