మాదాపూర్ హైటెక్స్ లో ఇండియన్ నేషనల్ గాడ్జెట్ ఎక్స్ పోను ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా భారతదేశ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ గాడ్జెట్ ఎక్స్ పోను హైదరాబాద్ లో నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, రాజీవ్ మక్నీ తదితరులు పాల్గొన్నారు.