mt_logo

‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్..

జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్ ఈరోజు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద స్టాల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్, మేయర్ బొంతు రామ్మోహన్, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరికెపూడి గాంధీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన, నగర పౌరులు పలువురు పాల్గొన్నారు. సుమారు 40 వేల ఆహార ప్యాకెట్లను ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చారు. వృధా అవుతున్న ఆహార పదార్ధాలను అన్నార్ధులకు అందించేందుకు ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ప్రారంభించింది.

మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామని, స్వచ్చందంగా ఆహారం అందించేవారి కోసం ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించాలని హోటల్ యజమానులను, స్వచ్చంద సంస్థలను కమిషనర్ దాన కిషోర్ ఈ సందర్భంగా కోరారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా మనం జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 5 కే భోజనం పెడుతున్నాం. కనీసం ఆ రూ. 5 కూడా లేనివారు రోడ్లపై చాలామంది ఉన్నారు. అందుకే ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని చిన్నగా ప్రారంభించాం. ఈ కార్యక్రమం రోజూ ఉంటుంది. బర్త్ డేలు, ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఆహారం మిగిలిపోవడం సహజం. అటువంటి వారు తమకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ దాన కిషోర్ కోరారు. హైదరాబాద్ లో ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ఈ పని చేస్తున్నామని ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *