mt_logo

కేంద్ర వైఖరి వల్లే రైతులకు కష్టాలు : మంత్రి కేటీఆర్

ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొండి వైఖరి అవలంభిస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా ఇవాళ సిరిసిల్లలో జరుగుతున్న ధర్నాలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగడంతోపాటు వరి దిగుబడి కూడా పెరిగిందని, ఐతే కేంద్రం తీరు వల్లే ఇప్పుడు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అష్టకష్టాలు పడే పరిస్థితి వచ్చిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. యాసంగి ధాన్యమంతా కొంటామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో అన్నిటినీ అమ్ముకుంటున్న బీజేపీ, రైతుల వద్ద వడ్లు ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. కేంద్రం వడ్లు కొనడం ఆపొద్దని, రైతుల ఉసురు తియ్యొద్దని మంత్రి కేటీఆర్ ప్లకార్డులు పట్టి మరీ నిరసన తెలిపారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన టీఆర్ఎస్‌ మహాధర్నాకు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చి, ధర్నాను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *