mt_logo

రైతులు ధాన్యం తక్కువ ధరకు అమ్ముకోవద్ద: ఈటెల

  • వరికి మద్దతు ధర గ్రేడ్ ఎ: రూ. 1,770 కామన్ వెరైటీ: రూ. 1,750
  • ఖరీఫ్ ధాన్యం సేకరణపై జాయింట్ కలాక్టర్స్ తో మంత్రి సమీక్ష

ఖరీఫ్ ధాన్యం సేకరణపై జిల్లాల జాయింట్ కలాక్టర్స్ తో సమీక్ష నిర్వహిస్తున్న ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కమిషనర్ అకున్ సబర్వాల్.

ఈ ఖరీఫ్ లో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా, కాగా 34 లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని సివిల్ సప్లైస్ శాఖను కోరిన మంత్రి ఈటెల రాజేందర్.

గత సంవత్సరం 18 లక్షల మెట్రిక్ టన్నుల చేయగా ఈ ఏడాది దాని కంటే ఇది డబుల్ చేయాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల సాగు, దిగుబడి పెరిగిందని దీనివల్ల రాబోయే రోజుల్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని మంత్రి అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వేసుకున్న పంటకు గ్యారెంటీ ఉందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వాలు ధాన్యం సేకరణలో రైతుకి నమ్మకం కలిగించలేకపోయాయి కానే తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లలో పండిన పంటకు మద్దతు ధర వస్తుంది అనే నమ్మకం కలిగించింది అని అన్నారు. ఆ నమ్మకం నిలబెట్టే విధంగా మనమంతా పనిచేయాలని జాయింట్ కలెక్టర్లను, అధికారులను కోరారు. 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి 1,128 IKP సెంటర్లు, 1,799 ప్రాథమిక వ్యవస్థ సహకార సంఘాల కేంద్రాలు, 213 ఇతర కేంద్రాలు మొత్తంగా 3,140 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే సెంటర్ల సంఖ్య పెంచాలని ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనడం ఆలస్యం కావొద్దని సూచించారు. ఈ సెంటర్ల వద్ద మంచినీరు, మరుగుదొడ్లతో పాటు అన్ని ఏర్పాట్లు ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు.

ధాన్యం సేకరణకు 8.59 కోట్ల గన్ని బ్యాగ్స్ అవసరం అని పాత బ్యాగ్స్ నాణ్యత విషయంలో కటినంగా వ్యవహరించాలని మంత్రి అధికారులకు సూచించారు.  కేసులున్న రైస్ మిల్లులకు ధాన్యం సరఫరా చేయవద్దని మంత్రి ఆదేశించారు. మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయించాలని పంపిన ధాన్యం వెంటనే దిగుమతి చేసుకునేలా చూడాలని కోరారు.

రాష్ట్ర అవసరాలకు పోగా 17 లక్షలమెట్రిక్ టన్నుల బియ్యం నిలువ చేయాల్సి వస్తుందని, అందులో 9.69 LMT సివిల్ సప్లైస్ శాఖ వద్ద అందుబాటులో ఉందని కమిషనర్ అకున్ సబర్వాల్ మంత్రికి వివరించారు. మిగిలిన స్పేస్ ను FCI నుండి తీసుకుంటామని తెలియజేశారు.

ఈ ఏడాది స్టేట్ పూల్ రైస్ కోసం 4 లక్షల మెట్రిక్ టన్నులు, సన్నబియ్యం కోసం లక్షన్నర మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాల్సిన అవసరం ఉందని కమిషనర్ తెలిపారు. గత ఏడాది 100 శాతం CMR సేకరించినందుకు కమిషనర్ కు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది కూడా అదే ఒరవడి కొనసాగించి డిపార్ట్మెంట్ ప్రతిష్టను పెంచాలని మంత్రి సూచించారు.
వరి మద్దతు ధర గ్రేడ్ ఎ: రూ. 1,770 కామన్ వెరైటీ: రూ. 1,750 అందిస్తామని రైతులు ఎవరు కూడా తక్కువ ధరకు అమ్ముకోవద్దని మంత్రి కోరారు.

పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డ్ లన్నిటిని ఇస్తామని చెప్పిన మంత్రి బియ్యం మిగిల్చుకొనే ఆలోచన లేదు మిస్ యూజ్ కాకుండా చూడడమే తమ లక్ష్యమన్నారు. బియ్యం తీసుకోకపోయినా కార్డ్ రద్దు అవ్వదు కాబట్టి తినని వారు రేషన్ బియ్యం తీసుకోవద్దని మంత్రి మరో సారి ప్రజలను విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *