mt_logo

దాడులపై కేంద్రం సీరియస్: APNGOల మీద మరో రెండు కేసుల నమోదు

 

APNGO మీటింగు ముసుగులో హైదరాబాదుపై దండయాత్రకు వచ్చిన సీమాంధ్ర గుండా తండాలు ఇక్కడి భూమిపుత్రులపై చేసిన దాడులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈ సభకు అనుమతి ఇవ్వడం నుండి అన్నీ తానై నడిపించిన డీజీపీ దినేశ్ రెడ్డికి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయ్యింది.

దీంతో మొన్న తెలంగాణ యువకులపై, పోలీస్ కానిస్టేబుల్ పైన దాడికి తెగబడ్డ సీమాంధ్ర గూండాలపై కేసులు నమోదుచేసి వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీస్ అధికారులను ఆదేశించాడు.

జై తెలంగాణ నినాదాలు చేసినందుకు దాడికి గురైన కానిస్టేబుల్ శ్రీనివాస్ నుండి ఈపాటికే ఫిర్యాదు తీసుకున్న సైఫాబాద్ పోలీసులు, నిన్న సభలో దాడికి గురైన చేగొండి చంద్రశేఖర్ నుండి కూడా ఫిర్యాదు తీసుకున్నారు.

మొన్న సభలో జై తెలంగాణ నినాదాలు చేసినందుకు చంద్రశేఖర్ ను రాడ్లు, కుర్చీలతో రక్తాలు కారేలా కొట్టారు సీమాంధ్ర గూండాలు.

అట్లాగే కానిస్టేబుల్ శ్రీనివాస్ పైన దాడి జరుగుతుంటే కాపాడడానికి పోయిన వరంగల్ అర్బన్ సీ.ఐ. విష్ణుమూర్తిపైన కూడా సీమాంధ్ర గూండాలు దాడి చేసి కొట్టారు. ఈ మేరకు ఆయన కూడా నిన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

దీంతో మొన్న సీమాంధ్ర గూండాలు తెలంగాణ పౌరులపై చేసిన దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *