mt_logo

ఈరోజు ఢిల్లీలో జరగనున్న మెట్రోపొలిస్ సమావేశం

అంతర్జాతీయ మేయర్ల సదస్సు అక్టోబర్ 7 నుండి 9 వ తేదీవరకు హైదరాబాద్ లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. సదస్సు సన్నాహకాల్లో భాగంగా ఢిల్లీలోని ఇండియా హాబిటేట్ సెంటర్ లో ఒక సమావేశాన్ని సోమవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖామంత్రి తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తదితరులు పాల్గొంటారు.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ వేరే దేశంలో ఉన్నందున ఈ కార్యక్రమానికి జ్వాలా గుత్తాను ఆహ్వానించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నగర బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచం నలుమూలలా చాటేందుకు అవసరమైన ఏర్పాట్లను ఈ సందర్భంగా ఖరారు చేస్తామని, మెట్రోపొలిస్ సదస్సుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం నుండి ఢిల్లీతో పాటు నగరంలోనూ ఈ తరహా సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *