mt_logo

ఈనెల 9నుండి టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఈనెల 9 నుంచి ప్రారంభించడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. మెదక్ జిల్లా గజ్వేల్ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ వేయగానే ముందుగా తొలిసభను హుజూరాబాద్ లో నిర్వహించనున్నారు. 11న కరీంనగర్, 12న నల్గొండ, 13న చేవెళ్లలో సభలు నిర్వహిస్తారని, కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని సభలో ప్రసంగించనున్నారని తెలిసింది. కేసీఆర్ ప్రసంగం అందరూ ఒకేసమయంలో వినేందుకు 40 చోట్ల స్క్రీన్ లను ఏర్పాటుచేయనున్నారని, త్రీడీ పద్ధతిలో కేసీఆర్ ప్రసంగం ఉంటుందని పార్టీ శ్రేణులు తెలిపాయి. ఇదిలా ఉండగా జహీరాబాద్ లోక్ సభ స్థానానికి బీబీ పాటిల్ ఈ రోజు నామినేషన్ వేయగా ఆయనవెంట టీఆర్ఎస్ నేతలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, హన్మంత్ షిండే, ఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *