mt_logo

టీఆర్ఎస్ లో చేరిన నోములనర్సింహయ్య, గుర్నాథరెడ్డి

సీపీఎం నేత నోముల నర్సింహయ్య, కాంగ్రెస్ నేత గుర్నాథరెడ్డి ఈ రోజు ఉదయం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితోపాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామ్మోహన్ గౌడ్, టీడీపీ నేతలు ప్రేమ్ కుమార్ గౌడ్, ముఠా గోపాల్, కొలను హన్మంత్ రెడ్డి, డా. వీఎస్ రావు తదితరులు పార్టీలో చేరారు. నోముల నర్సింహయ్యకు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం, గుర్నాథరెడ్డికి కొడంగల్ అసెంబ్లీ స్థానం కేటాయిస్తారని సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జి మురళీగౌడ్ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. జూబ్లీహిల్స్ టిక్కెట్ ను తనకు కాకుండా మాగంటి గోపీనాథ్ కు చంద్రబాబు ఇవ్వడంతో టీడీపీని వీడి కారెక్కనున్నారని తెలిసింది.

టీఆర్ఎస్ లో చేరినతర్వాత నోముల నర్సింహయ్య విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీలే ద్రోహం చేశాయని, ఆ పార్టీలను కనుమరుగయ్యేలా చేయాలని మండిపడ్డారు. దొరపెత్తందారీ విధానానికి వ్యతిరేకంగానే జానారెడ్డిపై పోటీ చేస్తున్నానని అన్నారు. తెలంగాణకోసం అసెంబ్లీ పోడియంలోకి వెళ్తే సీపీఎం తనపై చర్యలు తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *