mt_logo

తెలంగాణ ఉద్యమం జరిగినన్నాళ్ళూ కేసీఆర్ లో దొరతనంకనపడలేదా?

కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని అనగానే కేసీఆర్ లో దొరతనం, అహంకారం కనిపించాయా? అని మందా జగన్నాధం కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు, తెలంగాణ ఏర్పాటు జరిగేటప్పుడు కేసీఆర్ లో కనిపించని దొరతనం ఇప్పుడు కనిపిస్తుందా? అని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. తెలంగాణ కోసం యాదిరెడ్డి పార్లమెంటు సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందించకుండా ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తే ఊరుకునేదిలేదని, దళితులు, బలహీన వర్గాలపై కేసీఆర్ కు చిన్నచూపు ఉంటే శాసనసభలో బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఫ్లోర్ లీడర్ గా ఎందుకు పెడతారని, ఆయనపై వస్తున్న విమర్శలు అర్థరహితం అని కొట్టిపడేశారు. మాజీ మంత్రి డీకే అరుణ దళిత వ్యతిరేకి అని, తెలంగాణ గురించి ఏనాడూ పట్టించుకోని ఆమె జూలై 30 ప్రకటన తర్వాతే తెలంగాణ వాదం వినిపించారని విమర్శించారు. దళిత ఎంపీగా ఉన్న తనను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తాబేదారుగా ఉన్నానని మల్లురవి విమర్శించడం తగదని, మల్లు రవి ఎవరికి తాబేదారుగా ఉన్నాడో మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు తెలుసని మండిపడ్డారు. తాను వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపునే పోటీ చేస్తానని, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *