సైక్లోన్ గులాబ్..ఉత్తర, తూర్పు తెలంగాణలో అతి భారీ వర్షాలు

  • September 25, 2021 2:44 pm

సైక్లోన్ గులాబ్ ఉత్తర, తూర్పు తెలంగాణ మీద తీవ్ర ప్రభావం చూపబోతుంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు.. “శుక్రవారం బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం శనివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారింది. శనివారం అర్థరాత్రి వరకు ఆ వాయుగుండం తుఫానుగా మారి ఉత్తర కోస్తా లేదా దక్షిణ ఒడిస్సా దగ్గర ఆదివారం సాయంత్రం వరకు తీరం దాటనుంది. ఆ తరువాత ఛత్తీస్ ఘడ్ లోకి ప్రవేశించి పూర్తిగా బలహీన పడనుంది. ఈ తుఫాను ఛత్తీస్ ఘడ్ లోకి ప్రవేశించినపుడు అంటే ఈ నెల 26 రాత్రి నుండి 27వ తేదీ అర్థరాత్రి వరకు ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే మిగతా తెలంగాణ జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడనున్నాయి. తరువాత ఈ అల్పపీడనం విదర్భవైపుగా సాగి 28వ తేదీన వర్షాలు తగ్గనున్నాయి. ఈ తుఫాను మరీ అంత తీవ్రమైన తుఫాను కాకపోయినా భారీ వర్షాలను నమోదు చేయనుంది”.


Connect with us

Videos

MORE